
చేపలు బట్టలుతుకుతాయి..
నిజం.. ఈ వాషింగ్‌మెషీన్‌లో చేపలే బట్టలుతుకుతాయి. అయితే.. అవి రోబో చేపలు. ఇప్పుడు చాలా మల్టీప్లెక్స్‌లలో మృత శరీర కణాలను తినే డాక్టర్ ఫిష్‌లతో కూడిన తొట్టెలు పెడుతున్నారు. వాటిలో మనం కాళ్లు పెడితే.. ఆ చేపలు వచ్చి.. కాళ్ల వద్ద ఉన్న మృత శరీర క ణాలను తినేస్తాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకునే దక్షిణ కొరియాకు చెందిన చాంగ్ జియాంగ్ ‘పెసెరా’ అనే ఈ వాషింగ్ మెషీన్ డిజైన్‌ను రూపొందించారు.
ఇందులో డిటర్జెంట్ అవసరముండదు. మామూలు వాషింగ్ మెషీన్ తిరిగినట్లే తిరుగుతుంది. అయితే.. బట్టల్లోని మురికిని ఇందులోని రోబో చేపలు తినేస్తాయి. రోబో చేపల ముందు భాగంలో ఉండే కెమెరా మురికిని గుర్తిస్తుంది. దీంతో రోబో చేప అక్కడికి చేరి.. పనికానిచ్చేస్తుంది. పైగా.. ఇది అక్వేరియం తరహాలో ఉండటంతో హాలులో అలంకరణ సామగ్రిగానూ పనిచేస్తుంది. అంతేకాదు.. సున్నితమైన శరీర స్వభావం ఉన్నవారికి డిటర్జెంట్లు పడకపోవడం వల్ల దద్దుర్లు రావడం వంటివి జరుగుతుంది. ఈ వాషింగ్ మెషీన్‌తో ఆ సమస్య ఉండదు.