న్యూఢిల్లీ: విదేశీ మారక ద్రవ్య(ఫెరా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జరిపిన సోదాల్లో భారీగా డబ్బు పట్టుబడింది. అయితే ఈసారి దొరికిన డబ్బు బీరువాల్లోనో, లాకర్లోనో కాదు వాషింగ్‌మెషిన్‌లో ప్రత్యక్షమైంది. ఢిల్లీలోని క్యాప్రికార్నియన్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఆఫీసుల్లో ఈడీ మంగళవారం ఏకకాలంలో సోదాలు జరిపింది.
ఈ సోదాల్లో వాషింగ్‌మెషిన్‌లో దాచి ఉంచిన రెండున్నర కోట్ల రూపాయలను ఈడీ పట్టుకుంది. ఇవి కాకుండా పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులను ఈడీ స్వాధీనం చేసుకుంది. రూ.1800 కోట్ల మేర సింగపూర్ కంపెనీలకు అక్రమ చెల్లింపులు చేసినట్లు క్యాప్రికార్నియన్ షిప్పింగ్ కంపెనీపై ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment