కొచ్చి: లోక్‌సభ ఎన్నికల వేళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు కేరళ హైకోర్టు కీలక సూచన చేసింది. ప్రచారానికి కొద్ది సమయం మాత్రమే ఉన్నందున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని దర్యాప్తు పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని వ్యాఖ్యానించింది. మసాలా బాండ్లకు సంబంధించి ఫెరా చట్టం ఉల్లంఘన ఆరోపణలపై ఈడీ తనకు పదే పదే సమన్లు ఇవ్వడంపై కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు పిటిషనర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఆయనకు ప్రచారానికి కేవలం నెల రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే ఉందని గుర్తు చేసింది. ఈ సమయంలో ఎంపీ అభ్యర్థిని ఇబ్బంది పెట్టడం సరికాదని ఈడీకి సూచించింది. పిటిషన్ విచారణను మే 22కువాయిదా వేసింది.
మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐసాక్ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలోని పతనంతిట్ట నియోజకవర్గం నుంచి సీపీఎం నుంచి బరిలో ఉన్నారు. రెండవ దశ పోలింగ్‌లో భాగంగా ఏప్రిల్ 26న కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన నేతలను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి.. నేతలు, సినీ ప్రముఖులపై ఐటీ, ఈడీ దాడులు
Comments
Please login to add a commentAdd a comment