thomas issac
-
నేతల వెంట ‘ఈడీ’.. కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కొచ్చి: లోక్‌సభ ఎన్నికల వేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు కేరళ హైకోర్టు కీలక సూచన చేసింది. ప్రచారానికి కొద్ది సమయం మాత్రమే ఉన్నందున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని దర్యాప్తు పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని వ్యాఖ్యానించింది. మసాలా బాండ్లకు సంబంధించి ఫెరా చట్టం ఉల్లంఘన ఆరోపణలపై ఈడీ తనకు పదే పదే సమన్లు ఇవ్వడంపై కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు పిటిషనర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఆయనకు ప్రచారానికి కేవలం నెల రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే ఉందని గుర్తు చేసింది. ఈ సమయంలో ఎంపీ అభ్యర్థిని ఇబ్బంది పెట్టడం సరికాదని ఈడీకి సూచించింది. పిటిషన్ విచారణను మే 22కువాయిదా వేసింది. మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐసాక్ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలోని పతనంతిట్ట నియోజకవర్గం నుంచి సీపీఎం నుంచి బరిలో ఉన్నారు. రెండవ దశ పోలింగ్‌లో భాగంగా ఏప్రిల్ 26న కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన నేతలను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. నేతలు, సినీ ప్రముఖులపై ఐటీ, ఈడీ దాడులు -
చికెన్ కిలో రూ.87కే అమ్మండి: మంత్రి
తిరువనంతపురం: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలు అవుతున్న నేపథ్యంలో కిలో చికెన్ రూ.87/-కే అమ్మాలని కేరళ ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఐసాక్ పౌల్ట్రీ వ్యాపారులను కోరారు. లేకుండే చర్యలు తప్పవని హెచ్చరించారు. జీఎస్టీ పన్ను రేట్లలో చికెన్ జీరో ట్యాక్స్ కిందకు వస్తుంది. జీఎస్టీ అమలు కాకముందు 14.5 శాతం పన్నును చికెన్‌పై కేరళ రాష్ట్రం వసూలు చేసేది. జీఎస్టీ అమలు తర్వాత చికెన్ ధరలు గణనీయంగా తగ్గించాల్సివున్నా పౌల్ట్రీ వ్యాపారులు మాత్రం పాత ధరలతోనే అమ్మకాలు జరుపుతున్నారు. ఈ విషయంపై దృష్టి సారించిన ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఐసాక్.. వ్యాపారులకు గట్టి హెచ్చరికలు చేశారు. ఇదిలావుండగా.. చికెన్ కిలో రూ.87/-కు అమ్మడం అసాధ్యమని పౌల్ట్రీ వ్యాపారులు వ్యాఖ్యానించారు. పౌల్ట్రీ ఫారంల నుంచి చికెన్ కొనుగోలు రూ.115/- ఉంటోందని.. దాన్ని రీటైల్లో రూ.125/-కు అమ్ముతున్నామని చెప్పారు. చిన్నాచితకా వ్యాపారులు దాన్ని కిలో రూ.142/-కు అమ్ముతున్నారని వివరించారు. ఫారంలు కోళ్ల ధరలు తగ్గిస్తే రూ.87/-కే కిలో చికెన్ అమ్ముతామని చెప్పారు. చికెన్ ధర పెరుగుదలకు కారణం జీఎస్టీ కాదని తమిళనాడు నుంచి రాష్ట్రానికి వచ్చే చికెన్ దిగుమతి తక్కువకావడమేనని మరో వ్యాపారి పేర్కొన్నారు.