masala bonds
-
నేతల వెంట ‘ఈడీ’.. కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కొచ్చి: లోక్‌సభ ఎన్నికల వేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు కేరళ హైకోర్టు కీలక సూచన చేసింది. ప్రచారానికి కొద్ది సమయం మాత్రమే ఉన్నందున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని దర్యాప్తు పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని వ్యాఖ్యానించింది. మసాలా బాండ్లకు సంబంధించి ఫెరా చట్టం ఉల్లంఘన ఆరోపణలపై ఈడీ తనకు పదే పదే సమన్లు ఇవ్వడంపై కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు పిటిషనర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఆయనకు ప్రచారానికి కేవలం నెల రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే ఉందని గుర్తు చేసింది. ఈ సమయంలో ఎంపీ అభ్యర్థిని ఇబ్బంది పెట్టడం సరికాదని ఈడీకి సూచించింది. పిటిషన్ విచారణను మే 22కువాయిదా వేసింది. మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐసాక్ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలోని పతనంతిట్ట నియోజకవర్గం నుంచి సీపీఎం నుంచి బరిలో ఉన్నారు. రెండవ దశ పోలింగ్‌లో భాగంగా ఏప్రిల్ 26న కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన నేతలను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. నేతలు, సినీ ప్రముఖులపై ఐటీ, ఈడీ దాడులు -
హెచ్డీఎఫ్ సీకి ఆర్ బీఐ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ మసాలా బాండ్స్ ద్వారా నిధుల సేకరణకు కేంద్ర బ్యాంకు అనుమతి పొందింది. ఇప్పటికే 5వేలకోట్లకు పైగా మలాసా బాండ్లను విడుదల చేసిన హెచ్డీఎఫ్సీ మరో రూ.3,000 కోట్ల రూపీ(మసాలా) బాండ్ ఇష్యూకి అనుమతి సాధించింది. రూపీ బాండ్ల ద్వారా రూ.3,000 కోట్ల సమీకరణరు ఆర్ బీఐ అనుమతి పొందినట్టు బ్యాంకు శనివారం ప్రకటించింది. రూ. గతంలో రూ.5,000 కోట్ల సమీకరించిన హెచ్డీఎఫ్సీ మరిన్ని నిధుల సమీకరణకు యోచిస్తున్నట్టుతెలిపింది. మసాలా బాండ్ల ద్వారా రూ .3000 కోట్లు సేకరించనున్నట్లు దీనికి కేంద్రబ్యాంకు అనుమతి మంజూరు చేసిందని బ్యాంకు ఛైర్మన్ కెకీ మిస్త్రీ తెలిపారు. అయితే తాము మసాలాబాండ్ల ద్వారా మరింత సమీకరణను ఆశిస్తున్నామన్నారు. అయితే ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంచిస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం మూలంగా దేశీయంగా లోన్ డిమాండ్ భారీగా తగ్గిందని చెప్పారు. డీమానిటైజేషన్ ద్వారా దీర్ఘకాలంలో హోమ్ ఫైనాన్స్ రంగం మెరుగుపడనుందని ఆయన వ్యాఖ్యానించారు. -
ఆర్బీఐ 'మసాలా' నిర్ణయం
ముంబై: ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు, హెచ్డీఎఫ్సీ, ఎన్బీఎఫ్సీ వంటి నాన్ బ్యాంకింగ్ సంస్థలకు మాత్రమే పరిమితమైన మసాలా బాండ్ల జారీకి బ్యాంకులకు అనుమతి లభించింది. మార్కెట్ లిక్విడిటీని మరింత సులభతరం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర బ్యాంకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న ద్రవ్య కొరత సమస్యను పరిష్కరించే యోచనలో ఇకపై ద్రవ్య సర్దుబాటు వసతి(ఎల్ఏఎఫ్) కింద కార్పొరేట్ బాండ్లను సైతం స్వీకరించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించింది. తద్వారా బాండ్ మార్కెట్ పరిధిని పెంచడంతోపాటు బ్యాంకింగ్ రంగంలో ద్రవ్య లభ్యత పెరిగేలా ఈ చర్యలు చేపట్టింది. ఇకపై బ్యాంకులు కూడా విదేశాల్లో రూపాయి డినామినేడెట్ బాండ్లు (మసాలా బాండ్లు) జారీ చేయడం ద్వారా నిధులు సేకరించేందుకు ఆర్బీఐ అనుమతిస్తుంది. మార్కెట్లను అభివృద్ధి చేసేందుకు, భాగస్వామ్యాన్ని మెరుగు పర్చడానికి, మార్కెట్ లిక్విడిటీని మరింత సులభతరం చేసేందుకు, కమ్యూనికేషన్‌ను పెంచే ఉద్దేశంతో ఈ ప్రమాణాలను ప్రవేశపెడుతున్నామని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మసాలా బాండ్లు విదేశీ పెట్టుబడిదారులకు జారీచేసే రూపాయి ఆధారిత బాండ్లు. కానీ సెటిల్ మెంట్ మాత్రం డాలర్ పరంగా జరుగుతుంది. విదేశీ రూపాయి బాండ్ మార్కెట్‌ను ప్రోత్సహించేందుకు, తాత్కాలిక మూలధన అవసరాల కోసం విదేశీ రూపాయి బాండ్లను (మసాలా బాండ్లను) విడుదల చేసేలా అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది. దీని ద్వారా బ్యాంకులు మూలధన వనరులను సమకూర్చుకోవడంతోపాటు మౌలిక రంగ, చౌక గృహ ప్రాజెక్టులకు ఫండింగ్ చేసేందుకు అవసరమైన నిధులను సేకరించుకునే అవకాశం కలుగుతుంది. ఇప్పటివరకు కార్పొరేట్ సంస్థలతోపాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు మాత్రమే మసాలా బాండ్లు జారీ చేసేందుకు అనుమతి ఉండేది. తాత్కాలిక నిధుల అవసరాలను తీర్చుకునేందుకు బ్యాంకులు ఎల్ఏఎఫ్ను ఉపయోగించుకుంటాయి. ఆర్బీఐ తాజా నిర్ణయాలను హర్షం వ్యక్తమవుతోంది. ఈ పరిణామం బాండ్ మార్కెట్ విస్తరణకు ఎంతగానో ఉపయోగపడనుందని విశ్లేషకులు, మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా త్వరలోనే కరెన్సీ మార్కెట్లు, బాండ్ల లక్ష్యంగా పలు ప్రమాణాల పరంపరను ప్రకటించనున్నట్టు ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇంతకు ముందే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బాండ్లు, కరెన్సీ మార్కెట్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆర్బీఐ నిబంధనల్లో మార్పులకు యోచిస్తున్నారు. వచ్చేనెల 4 తేదీతో ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ మూడేళ్ల పదవీ కాలం ముగియనుంది. సెప్టెంబర్ 6 నుంచి కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ పగ్గాలు చేపట్టనున్న సంగతి తెలిసిందే.