న్యూఢిల్లీ: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ మసాలా బాండ్స్ ద్వారా నిధుల సేకరణకు కేంద్ర బ్యాంకు అనుమతి పొందింది.
ఇప్పటికే 5వేలకోట్లకు పైగా మలాసా బాండ్లను విడుదల చేసిన హెచ్‌డీఎఫ్‌సీ మరో రూ.3,000 కోట్ల రూపీ(మసాలా) బాండ్ ఇష్యూకి అనుమతి సాధించింది. రూపీ బాండ్ల ద్వారా రూ.3,000 కోట్ల సమీకరణరు ఆర్ బీఐ అనుమతి పొందినట్టు బ్యాంకు శనివారం ప్రకటించింది. రూ. గతంలో రూ.5,000 కోట్ల సమీకరించిన హెచ్‌డీఎఫ్‌సీ మరిన్ని నిధుల సమీకరణకు యోచిస్తున్నట్టుతెలిపింది. మసాలా బాండ్ల ద్వారా రూ .3000 కోట్లు సేకరించనున్నట్లు దీనికి కేంద్రబ్యాంకు అనుమతి మంజూరు చేసిందని బ్యాంకు ఛైర్మన్ కెకీ మిస్త్రీ తెలిపారు. అయితే తాము మసాలాబాండ్ల ద్వారా మరింత సమీకరణను ఆశిస్తున్నామన్నారు. అయితే ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంచిస్తున్నామన్నారు.
ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం మూలంగా దేశీయంగా లోన్ డిమాండ్ భారీగా తగ్గిందని చెప్పారు. డీమానిటైజేషన్ ద్వారా దీర్ఘకాలంలో హోమ్ ఫైనాన్స్ రంగం మెరుగుపడనుందని ఆయన వ్యాఖ్యానించారు.