![Arvind Kejriwal Eating Mangoes To Raise Blood Sugar Level - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/18/Arvind2.jpg.webp?itok=CiJ21UeY)
ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది. మార్చి 21న అరెస్ట్ అయిన తరువాత మార్చి 28వ తేదీ వరకు అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ సిటీ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు.
ఇటీవల షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని.. క్రమం తప్పకుండా తనిఖీ చేసేందుకు వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ డాక్టర్‌ను సంప్రదించేందుకు అనుమతి కావాలని కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని, చక్కెరతో కూడిన టీ తాగుతున్నారని ఈడీ గురువారం ఢిల్లీ కోర్టుకు తెలిపింది.
ఉద్దేశ్యపూర్వకంగానే స్వీట్స్ తిని షుగర్ లెవల్స్ పెంచుకుంటున్నారు. షుగర్ లెవెల్స్ పెరిగితే వైద్యపరమైన కారణాలను చూపుతూ బెయిల్ పొందాలంకునుటున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే అని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ ఈడీ సమర్పణల మీద అభ్యంతరం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment