ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ కన్వీనర్ 'అరవింద్ కేజ్రీవాల్' అరెస్టుకు నిరసనగా కొన్ని రోజులకు ముందు దేశ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ప్రధాని మోదీ ఇంటిని చుట్టుముట్టడానికి ప్రయతించారు. తాజాగా ఇప్పుడు కీలక నేతలు నిరాహార దీక్ష చేపట్టారు.
అరవింద్ కేజ్రీవాల్' అరెస్టుకు నిరసనగా ఏప్రిల్ 7న ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీలో మాత్రమే కాకుండా.. బోస్టన్‌లోని హార్వర్డ్ స్క్వేర్, లాస్ ఏంజెల్స్‌లోని హాలీవుడ్ సైన్, వాషింగ్టన్ DCలోని ఇండియన్ ఎంబసీ వెలుపల, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్, టొరంటో, లండన్ & మెల్‌బోర్న్‌లలో కూడా భారతీయులు ఇలాంటి నిరసనలు నిర్వహించారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ గ్రామం ఖట్కర్ కలాన్ వద్ద సామూహిక నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్, డిప్యూటీ స్పీకర్ రాఖీ బిలా, మంత్రులు అతిషి, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్ సహా పలువురు సీనియర్ ఆప్ నేతలు దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సామూహిక నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలో పాల్గొనాలని ఆప్ ఢిల్లీ యూనిట్ కన్వీనర్ గోపాల్ రాయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం ఆప్‌ని అంతం చేయాలనే బీజేపీ కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. ఏప్రిల్ 15 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీలో ఉంటారు.
"देश में बढ़ती हुई तानाशाही के खिलाफ और अरविंद केजरीवाल जी की गिरफ़्तारी के खिलाफ़ आज हम उपवास पर बैठे हैं। अगर आप भी दिल्ली में हैं तो जंतर मंतर पर पहुंचिए"
— Aam Aadmi Party Delhi (@AAPDelhi) April 7, 2024
- AAP प्रवक्ता रीना गुप्ता जी pic.twitter.com/N3bUDYMejG
Comments
Please login to add a commentAdd a comment