న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి 'అరవింద్ కేజ్రీవాల్' అరెస్ట్ అయిన తరువాత కూడా పరిపాలన సాగిస్తున్నారు. జైలు నుంచి పంపిస్తున్న సందేశాలను తన భార్య సునీత కేజ్రీవాల్ ప్రజలకు చేరవేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని నడిపించడానికి 'సునీత' సరైన వ్యక్తి అని ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు.
ఢిల్లీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న భరద్వాజ్.. ప్రధాన కార్యాలయంలోని జరిగిన ఒక కార్యక్రంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రికి తాను "దూత" అని సునీత కేజ్రీవాల్ ఎప్పుడూ చెబుతుంటారని అన్నారు. పార్టీ రాజకీయాలు దాని మేనిఫెస్టో చుట్టూ మాత్రమే తిరుగుతాయని.. సునీత కేజ్రీవాల్ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి చాలా కీలకమైన వ్యక్తి అని ఆయన అన్నారు.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయన భార్య ఇప్పటివరకు మూడు డిజిటల్ బ్రీఫింగ్‌లను ప్రసంగించారు.
లోక్‌సభ ఎన్నికల్లో సునీత కేజ్రీవాల్ పార్టీ తరపున ప్రచారం చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అది జరిగితే మేము కూడా సంతోషిస్తాము, ఆ నిర్ణయం ఆమె వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment