ఢిల్లీ: ఢిల్లీలో లోక్‌సభ 2024 ఎన్నికలు ఆరో దశలో (మే 25) జరగనున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రధాన, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన కారణంగా ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. రేపటి నుంచి (శనివారం) ఆప్ తరపున ప్రచారం నిరవహించనున్నట్లు కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రకటించారు.
సునీతా కేజ్రీవాల్ తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి రోడ్‌షో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో మాత్రమే కాకుండా పంజాబ్, హర్యానాలలో కూడా పార్టీ తరపున ప్రచారం చేయనున్నట్లు విలేకర్ల సమావేశంలో సునీతా కేజ్రీవాల్ స్పష్టం చేశారు. శనివారం తూర్పు ఢిల్లీలో తన మొదటి రోడ్‌షోను.. ఆదివారం పశ్చిమ ఢిల్లీలో రోడ్‌షోను నిర్వహిస్తుందని సమాచారం.
లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ఆప్' తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇక ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, చాందినీ చౌక్ స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment