న్యూఢిల్లీ: భూ కుంభకోణంలో అరెస్టయి జైలులో ఉన్న, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్‌సోరేన్‌కు త్వరలో ఊరట కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోరేన్ అరెస్టు అక్రమమంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం(మే13) జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.
సోరేన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మూడు రోజుల్లో స్పందించాలని ఈడీని సుప్రీంకోరింది. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నందున పిటిషన్‌పై విచారణ వేగవంతం చేయాలని సోరేన్ న్యాయవాది చేసిన అభ్యర్థనకు సుప్రీం అంగీకరించింది. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కల్పించిన ఊరటనే హేమంత్ సోరేన్‌కు ఇవ్వాల్సిన అవసరం ఉందని సిబల్ సుప్రీంను కోరారు.
అయితే ధర్మాసనం కేసును 20కి వాయిదా వేయబోతుంటే సిబల్ మళ్లీ జోక్యం చేసుకున్నారు. 20కి వాయిదా వేస్తే పిటిషన్ విత్‌డ్రా చేసుకుంటానని, తన క్లైంట్‌కు అన్యాయం జరుగుతుందని వాదించారు. దీంతో ధర్మాసనం పిటిషన్ విచారణను 17కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment