
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాబోయే ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇంతలోనే కేజ్రీవాల్‌ను మరో కష్టం చుట్టుముట్టింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అనుమతి ఇచ్చింది.
అరవింద్ కేజ్రీవాల్ పై కేసు నమోదు చేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఈ అనుమతిని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీకి అనుమతినిచ్చింది. ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు అరవింద్ కేజ్రీవాల్‌పై అభియోగాల నమోదుపై స్టే విధించింది. ఇందుకోసం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
పీఎంఎల్‌ఏ కింద ప్రాసిక్యూట్ చేయడానికి అవసరమైన అనుమతి లేకుండానే ట్రయల్ కోర్టు ఛార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకుందని కేజ్రీవాల్ వాదించారు. సీబీఐ తర్వాత ఇప్పుడు ఈడీకి ఇందుకు అనుమతి లభించింది. ఢిల్లీ మద్యం కేసులో అవినీతి నిరోధక చట్టం కింద అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సీబీఐ గత ఏడాది ఆగస్టులో అవసరమైన ఆమోదం పొందింది. అయితే ఈడీ ఇందుకు ఇంకా ఆమోదం పొందలేదు. అయితే ఇప్పుడు హోం మంత్రిత్వ శాఖ స్వయంగా కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకునేందుకు అనుమతినిచ్చింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌లో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ 'సౌత్ గ్రూప్' నుండి లంచం తీసుకున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ బృందం దేశ రాజధానిలో మద్యం అమ్మకాలు, పంపిణీని పర్యవేక్షించింది. 2021-22 సంవత్సరానికి ఢిల్లీ ఆప్ ప్రభుత్వం రూపొందించిన ఎక్సైజ్ విధానం నుంచి ఈ బృందం లబ్ది పొందిందనే ఆరోపణలున్నాయి.
ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఐదు వ్యాన్లతో ఆప్‌పై కాంగ్రెస్ ప్రచార దాడి
Comments
Please login to add a commentAdd a comment