ఉపాధికి వేదిక... ఆక్వాకల్చర్
అప్‌కమింగ్ కెరీర్: ఆక్వా కల్చర్ అంటే కేవలం చేపలు, రొయ్యల పెంపకమే కాదు. ఔషధాల తయారీకి ఉపయోగించే ఒకరకమైన నాచును, మొక్కలను చెరువుల్లో పెంచడాన్ని కూడా ఆక్వాకల్చర్‌గా పరిగణిస్తున్నారు. చేపలు, రొయ్యల సాగును కెరీర్‌గా ఎంచుకుంటే మెరుగైన భవిష్యత్తుకు, ఆకర్షణీయమైన ఆదాయానికి ఢోకా ఉండదని ఈ రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ రైతులతోపాటు ఉన్నత చదువులు చదువుకున్న ఆధునిక యువత సైతం ఇటీవల ఆక్వా రంగంలోకి ప్రవేశించి, విజయవంతంగా ముందుకు సాగుతుండడం గమనార్హం.
అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత ఏదైనా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్(బీఎఫ్‌ఎస్)లో ప్రవేశం పొందొచ్చు.
వేతనాలు: పనిచేస్తున్న సంస్థ పరిధిని బట్టి వేతనాలు మారుతుంటాయి. సాధారణంగా ఆక్వా నిపుణులకు ప్రారంభంలో నెలకు రూ.20 వేల దాకా వేతనం లభిస్తుంది. ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో పోలిస్తే ఆక్వా రంగంలో అధిక ఆదాయం ఉంటుంది.
ఆక్వాకల్చర్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
1. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్-ముంబై
వెబ్‌సైట్: http://www.cife.edu.in/
2. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్-భువనేశ్వర్
వెబ్‌సైట్: http://www.cifa.in/web/
3. రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్-తమిళనాడు
వెబ్‌సైట్: http://www.rgca.org.in/
4. కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషియన్ స్టడీస్-కేరళ
వెబ్‌సైట్: http://www.kufos.ac.in/
5. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: http://www.ignou.ac.in/
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి అవకాశాలు
‘‘అగ్రికల్చర్, అక్వాకల్చర్ వంటి కోర్సులు చేసిన వారికి ఉద్యోగాల పరంగా ఢోకా ఉండదు. ఆహార ఉత్పత్తుల రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగింది. బహుళ జాతి కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. అక్వాకల్చర్ కోర్సును పూర్తిచేసి.. సబ్జెక్టుపై ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంచుకుంటే నెలకు రూ.40 వేలకు తక్కువ కాకుండా వేతనం సంపాదించే వీలుంది. ప్రభుత్వ రంగంలోనూ మంచి అవకాశాలున్నాయి’’.
- పి.హరి, మత్స్యశాఖ ఉద్యోగి, ముంబై