చేపల చెరువులో విషం
Published Thu, Sep 7 2017 1:04 PM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM
- భారీగా నష్టం
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పసుమాలలో దారుణం వెలుగుచూసింది. గ్రామ శివారులోని ఓ చేపల చెరువులో గుర్తుతెలియని దుండగులు రసాయన పదార్థాలు కలిపారు. దీంతో చెరువులోని చేపలు మృత్యువాతపడ్డాయి. సుమారు కోటి రూపాయల విలువైన చేపలు మృతి చెందినట్లు మత్యకారులు తెలిపారు. ఇంత జరిగినా ఇప్పటివరకు అధికారులు స్పందించలేదంటూ వారు వాపోతున్నారు.
Advertisement
Advertisement