మాట్లాడుతున్న కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల
సాక్షి, మహబూబ్‌నగర్: త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ను స్వాధీనం చేసుకుం టామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల అన్నా రు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని బృందావన్ గార్డెన్ ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన జనజాగరణ అభియాన్‌లో ఆయన మాట్లాడారు. జమ్మూ–కశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు తీసుకురావడానికే ఆర్టికల్ 370 రద్దు చేశామన్నారు. ఆనాడు దేశానికి స్వతంత్రం వచ్చినా హైదరాబాద్, జనాఘడ్, కశ్మీర్ భారతదేశంలో విలీనం కాలేదన్నారు. సర్దార్‌వల్లభాయ్ పటేల్ చొరవతోనే హైదరాబాద్‌ను విలీనం చేసి 1948 లో జాతీయజెండా ఎగురవేశారన్నారు. నెహ్రూ నిర్ణయాల వల్లే కశ్మీర్‌ను అప్పట్లోనే విలీనం చేయలేకపోయారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కశ్మీర్‌లో ప్రత్యేక రా జ్యంగం అమలు, పాకిస్తాన్ దేశస్తులకు పౌరసత్వం కల్పిం చడం వంటి అంశాల నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తాయన్నారు. దీంతో అక్కడ ఉగ్రవాదులు చెలరేగిపోవడానికి కారణమైందన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల ప్రజలకు ఎ దురయ్యే ఇబ్బందులపై ఇంతవరకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వలేదన్నారు. బీజేపీ నేతలు, మాజీ మంత్రులు డి.కె. అరుణ, పి.చంద్రశేఖర్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, మాజీ ఎమ్మెల్యే చిం తల రాంచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నాయకులు పడాకుల బాల్‌రాజ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
రామమందిరం తథ్యం
ఎన్నికలముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నరేంద్రమోడీ నాయకత్వంలో అయోద్యలో రామమందిరం నిర్మాణం తథ్యమని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. 70 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత దేశ స్వాతంత్ర ఫలాలు అందుకోలేకపోయారని, ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ ప్రజలకు స్వచ్ఛా స్వాతంత్రాలు కల్పించారన్నారు. అనంతరం మాజీ మంత్రి డీకె.అరుణ మాట్లాడారు. గత పాలకులు చేయని సాహసం బీజేపీ చేసిందని, దేశంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment