సాక్షి, చైన్నె: సనాతన ధర్మం వ్యవహారంలో తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.., ఇంకా చెప్పాలంటే, నిర్మూలనే లక్ష్యంగా ఎక్కడ కావాలంటే, అక్కడ మరింతగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని.. మంత్రి ఉదయ నిధిస్టాలిన్ స్పష్టం చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు ఆయనపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నాయి.
బిహార్‌లో ఉదయనిధిపై సోమవారం కేసు కూడా నమోదైంది. ఓబీజేపీతో పాటు హిందూ సంఘాల డీఎంకేను టార్గెట్ చేసి విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అ న్నామలై ఒక అడుగు ముందుకు వేసి, సనాతన ధర్మం గురించి ఉదయ నిధి అనుచిత వ్యాఖ్యలపై దేవదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు మౌనం వహించడం సిగ్గుచేటన్నారు.
ఈనెల 10వ తేదీలోపు శేఖర్‌బాబు పదవి నుంచి వైదొలగని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పేర్కొంటూ, సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా తరహాలో నిర్మూలించలేమని, అది విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోందన్నారు. సనతాన ధర్మానికి వ్యతిరేకం అంటే, హిందూ, దేవదాయ శాఖ ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. కా గా తనకు వ్యతిరేకంగా కేసుల నమోదు, ఫిర్యాదులు హోరెత్తడంతో ఉదయ నిధి స్టాలిన్ తూత్తుకుడిలో మీడియాతో మాట్లాడుతూ, తాను చేసిన వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించాలని సూచించారు.
తాను స నాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశానే గానీ, హిందువుల గురించి కాదని స్పష్టంచేశారు. సామాజిక న్యాయం గురించి ప్రస్తావిస్తూ సనాతన ధర్మంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశానని, తాను ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడ లేదన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి మరో మార్గంలో తీసుకెళ్తున్నారని వివరించారు. మంత్రి శేఖర్‌బాబు రాజీనామాకు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
క్షమాపణకు పట్టు..
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఉదయ నిధి స్టాలిన్ తక్షణం క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఢిల్లీలోని బీజేపీ నేతలు తమిళనాడు భవన్ కమిషనర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని తమిళనాడు భవన్, డీఎంకే కార్యాలయానికి భద్రతను మరింతగా పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment