
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశాయి. భుట్టో వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ దేశవ్యాప్తంగా శనివారం పలు నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. బిలావల్ దిష్టిబొమ్మలను దగ్ధంచేశారు.
శనివారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోనూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ‘ భారత ప్రధానిపై అనాగరిక, హేయమైన నిందలు వేస్తున్న పాక్ మంత్రికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనల్లో ప్రజలంతా పాల్గొనాలి’ అంటూ బీజేపీ ఒక ప్రకటన చేసింది.