న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే 60 ఏళ్లు పైబడిన వారికి పూర్తి ఉచితంగా వైద్యం అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ స్కీమ్ పేరు ‘సంజీవని’ అని తెలిపారు.
ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆదాయంతో సంబంధం లేదని పేద,మధ్యతరగతి, ధనిక వర్గాలకు చెందిన వృద్ధులకు ఈ స్కీమ్ కింద ఉచిత వైద్యం అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పతత్రుల్లో ఎక్కడ కావాలంటే అక్కడ వైద్యం పొందవచ్చన్నారు.
#WATCH | Delhi | AAP National Convenor Arvind Kejriwal says, “Elderly over the age of 60 will receive free treatment under the Sanjeevani Yojna, in private and government hospitals both… There will be no upper limit on the cost of treatment. Registration for this will start in a… pic.twitter.com/WYQGjQI8Ga
— ANI (@ANI) December 18, 2024
మహిళలకు నెలవారి నగదు అందించే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన స్కీమ్‌ను ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మహిళలు, వృద్ధుల ఓట్లపై ఫోకస్ చేయడం ద్వారా ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని ఆప్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment