నేడు తెలంగాణ బ్రాహ్మణ ఐక్యతా సదస్సు
Published Sun, Jan 19 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
హన్మకొండకల్చరల్, న్యూస్‌లైన్ : కాజీపేటలోని రైల్వే స్టేడియంలో ఆదివారం తెలంగాణ బ్రాహ్మణ ఐక్యతా సదస్సు నిర్వహిస్తున్నారు. పోరాటాల పురిటిగడ్డగా పేరొందిన ఓరుగల్లులో మొదటిసారిగా బ్రాహ్మణులంతా ఐక్య ఫ్రంట్‌గా ఏర్ప డి భారీస్థాయిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే సదస్సుకు రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే సముద్రాల వేణుగోపాలచారి, పాలకుర్తి, సిద్ధిపేట, హన్మకొండ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, హరీష్‌రావు, దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, మ హాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేవీ.రమణాచారి, బీజేపీ జాతీయ నాయకుడు వి.ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్సీ తిరువరంగం సంతోష్‌కుమార్, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సౌందరరాజన్, కార్యనిర్వహణ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తదితరులు పాల్గొననున్నారు.
సదస్సు విజయవంతం కావాలని ర్యాలీ..
కాజీపేట రైల్వే స్టేడియంలో తెలంగాణ బ్రాహ్మణ అర్చక శ్రీవైష్ణవ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న తెలంగాణ బ్రాహ్మణ ఐక్యతా సదస్సు విజయవంతం కావాలని కోరుతూ శనివారం సాయంత్రం సంఘం నాయకులు భారీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు అయినవోలు వెంకటసత్యమోహన్ జెం డా ఊపి ప్రారంభించారు. కాగా, వరంగల్ ఎంజీఎం సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పోచమ్మమైదాన్, వరంగల్ రైల్వేస్టేషన్, వరంగల్ చౌరస్తా, బట్టల బజార్, భద్రకాళీ రోడ్, ములుగురోడ్, హన్మకొండచౌరస్తా, బ్రాహ్మణవాడ,
లష్కర్‌బజార్, అదాలత్ మీదుగా కాజీపేట రైల్వేస్టేడియం చేరుకుంది. ఈ సందర్భంగా నక్కలగుట్టలోని కాళోజీ నారాయణరావు కాంస్య విగ్రహానికి బ్రాహ్మణ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, తెలంగాణ బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ వి.విశ్వనాథరావు, బ్రాహ్మణ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు తిరవరంగం ప్రభా కర్‌రావు, పొలిటికల్ జేఏసీ కన్వీనర్ జీవీఎస్.శ్రీనివాసచారి, గుదిమెల్ల విజయకుమారాచార్య, తెలంగాణ బ్రాహ్మణ సమాఖ్య కన్వీనర్ వెన్నెంపల్లి జగన్‌మోహన్‌శర్మ, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి గంగు ఉపేంద్రశర్మ, సమాఖ్య అర్చక అధ్యక్షులు వల్లూరి పవన్‌కుమార్, శివపురం రామలింగారాధ్య, శ్వేతా ర్క గణపతి దేవాలయం ప్రధానర్చకులు ఐనవోలు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
స్టేడియంలో గణపతి హోమం..
కాజీపేట : కాజీపేట రైల్వే స్టేడియంలో ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ బ్రాహ్మణ ఐక్యత సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం అర్బన్ అధ్యక్షుడు వల్లాది పవన్‌కుమార్, పొలిటికల్ జేఏసీ కన్వీనర్ జీవీఎస్ శ్రీనివాసచారిలు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వారు రైల్వే స్టేడియంలో సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ బ్రాహ్మణులు గణపతి హోమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్‌కుమార్, జీవీఎస్ శ్రీనివాసచారిలు మాట్లాడారు. ‘తెలంగాణ ఐక్యత ముద్దురా.. సమైక్యాంధ్ర వద్దురా’ అనే నినాదంతో బ్రాహ్మణ, అర్చక, శ్రీవైష్ణవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణులకు చట్టసభల్లో, పార్టీల్లో రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం కల్పించాలనే అంశంపై చర్చ జరుగుతుందన్నారు. జిల్లాలోని బ్రాహ్మణులందరూ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ వి.విశ్వనాథరావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వెన్నంపెల్లి జగన్‌మోహన్‌శర్మ, తిరువగం ప్రభాకర్‌రావు, రాధాకృష్ణశర్మ, శివపురం రామలింగంచార్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement