
కొల్చారం (నర్సాపూర్): ఒకే పెళ్లి పందిట్లో అక్కాచెల్లెళ్లకు ఓ యువకుడు తాళికట్టాడు. కొద్ది రోజుల కిందట కర్ణాటకలోని కోలార్ జిల్లాలో జరిగిన పెళ్లిలాగే మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్‌పల్లి గ్రామంలో తాజా ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొల్పాల వెంకటేశ్‌కు స్వాతి, శ్వేత ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి స్వాతికి శివ్వంపేట మండలం పాంబండకు చెందిన మేనబావ బాల్‌రాజ్‌తో పెళ్లి కుదిరింది. రెండో కూతురు శ్వేతకు మతిస్థిమితం లేదు.
దీంతో శ్వేతని కూడా బాల్‌రాజ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. దీంతో పెళ్లి పత్రికలో వరుడితో పాటు ఇద్దరు అమ్మాయి ల పేర్లు కూడా ముద్రించి ఆదివారం గుట్టుచప్పుడు కాకుండా వివాహం జరిపించారు. అయితే వరుడు స్వాతిని మాత్రమే ఇంటికి తీసుకెళ్లగా.. మతిస్థిమితం లేని శ్వేతను తండ్రి తన ఇంటి వద్దే ఉంచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment