భారతదేశపు రిలయన్స్ రిటైల్ వెంచర్.. సెప్టెంబర్ 10న ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం డెల్టా గలీల్ ఇండస్ట్రీస్‌తో జాయింట్ వెంచర్‌ను ప్రకటించింది. ఇన్నర్‌వేర్ మార్కెట్‌ను విస్తరించడంలో భాగంగా 50/50 జాయింట్ వెంచర్ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయి. ఈ భాగస్వామ్యం ద్వారా డెల్టా గలీల్.. రిలయన్స్ ఉత్పత్తుల డిజైన్ అండ్ తయారీకి సహకరిస్తుంది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్లో తన పాదముద్రను విస్తరించేందుకు డెల్టా గలీల్ ఈ భాగస్వామ్యాన్ని ఉపయోగించుకుంటుంది. ఇందులో భాగంగానే రిటైల్, హోల్‌సేల్ వంటి వాటితో పాటు.. బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియోను విస్తరించనుంది.
భారతీయ వినియోగదారుల డిమాండ్స్ తీర్చడానికి.. వారు కోరుకునే దుస్తుల ఆవిష్కరణలను ఏర్పాటు చేయడమే ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశ్యం. కంపెనీ గణనీయమైన వృద్ధికి కూడా ఈ జాయింట్ వెంచర్ దోహదపడుతుంది. డెల్టా గలీల్ ఇండస్ట్రీస్ అనేది పురుషులు, మహిళలు, పిల్లల కోసం బ్రాండెడ్ & ప్రైవేట్ లేబుల్ దుస్తులను అందించే సంస్థ. ఈ కంపెనీ 1975లో ప్రారంభమైంది.
రిలయన్స్ రిటైల్ & డెల్టా గలీల్ భాగస్వామ్యం గురించి రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. భారతీయ వినియోగదారులకు వినూత్న ఉత్పత్తులను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. రిలయన్స్‌తో కలిసి ప్రయాణించడం చాలా ఆనందంగా ఉందని డెల్టా గలీల్ సీఈఓ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment