20 నవంబర్ నుంచి 26 నవంబర్ 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ప్రముఖ వ్యక్తులు పరిచయం కాగలరు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగస్తుల సేవలకు గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరమైన సమయం. లేత ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
అదనపు ఆదాయం సమకూరుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యల నుంచి కొంత ఊరట. దూరపు బంధువులను కలుసుకుంటారు. గతంలో చేజారిన వస్తువులు తిరిగి దక్కించుకుంటారు. వ్యాపారాలలో స్వల్పలాభాలు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. పసుపు, లేత గులాబీ రంగులు, తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని పూజించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనుకున్న పనుల్లో అవాంతరాలు. రాబడికి మించి ఖర్చులు. శ్రమ మరింతగా పెరుగుతుంది. ఆరోగ్యం కొంత ఇబ్బందిపెట్టవచ్చు. సోదరులు, మిత్రులతో విభేదాలు. ముఖ్య నిర్ణయాలలో కొంత నిదానం అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు. కళాకారులకు ఆకస్మిక పర్యటనలు. ఆకుపచ్చ, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఒక నిర్ణయం మీ స్థాయిని పెంచుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ సలహాల కోసం మిత్రులు ఆతృతగా ఎదురుచూస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. రాబడి అనూహ్యంగా పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలు అనుకున్నది సాధిస్తారు. తెలుపు, గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయమవుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం. కళాకారుల అంచనాలు నిజమవుతాయి. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఎంతో ఉత్సాహంగా ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగుల సమస్యలు తీరి, ఆనందంగా ఉంటారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తులు, బంధువులతో సత్సంబంధాలు. ఆదాయం ఆశాజనకం. భూవివాదాలు తీరే సూచనలున్నాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. నీలం, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
గతం కంటే ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ప్రతిభావంతులుగా గుర్తింపు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు, వివాదాలు త ప్పవు. క్రమేపీ సాధారణస్థితి ఏర్పడుతుంది. ఆదాయం కొంత మెరుగుపడుతుంది. ఎటువంటి సమస్య ఎదురైనా పట్టుదలతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారుల యత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి. గులాబీ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆదాయవ్యయాలు సమానంగా ఉంటాయి. అనుకున్న కార్యాలు కొంత శ్రమానంతరం పూర్తి కాగలవు. బంధువులతో కష్టసుఖాలు పంచుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులు కొంత ఉపశమనం పొందుతారు. కొన్ని సమస్యలు తీరే సమయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంతమేరకు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. కళాకారుల యత్నాలు కలసివస్తాయి. నీలం, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం చేయండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక వ్యవ హారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మీకృషి ఫలించే సమయం. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనయోగం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. నలుపు, బంగారురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త మిత్రులు పరిచయమవుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు. ఆకుపచ్చ, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు