వారఫలాలు : 22 జనవరి నుంచి 28 జనవరి 2017 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొన్ని వ్యవహారాలు నిదానంగా కొనసాగుతాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక పర్యటనలు. తెలుపు, గులాబీ రంగులు, తూర్పుదిశ వ్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఇంతకాలం పడిన శ్రమ కొంత మేరకు ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. స్వల్ప అనారోగ్యం. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. విద్యావకాశాలు పొందుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నీలం,తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగతాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి లాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు సత్కారాలు, అవార్డులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. రాబడి కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఆశించిన మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు కొద్దిపాటి చికాకులు. గులాబీ, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాబడి కొంత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమానురాగాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆదాయం సమకూరుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు సన్మానయోగం. గులాబీ, ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
వ్యయప్రయాసలతోనే కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో మాటపట్టింపులు. తీర్థయాత్రలు చేస్తారు. రాబడి కొంత నిరాశ కలిగిస్తుంది. దూరప్రాంతాల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. తెలుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఎంతో ఉత్సాహవంతంగా అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరు, ప్రఖ్యాతలు గడిస్తారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందడం వల్ల కొంత ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు తథ్యం. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. నలుపు, ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఇంటాబయటా అనుకూలత. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వస్తులాభాలు. ఇంటì నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు పురస్కారాలు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.