పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక చర్యలు | for development of schools taking special care | Sakshi
Sakshi News home page

పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక చర్యలు

Published Sun, Jul 31 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక చర్యలు

పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక చర్యలు

నకిరేకల్‌ : ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లు అన్నారు. నకిరేకల్‌ శివారులోని ఎస్‌ఎస్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం జరిగిన నకిరేకల్‌ ఎంఈఓ బండా వెంకట్‌నర్సింహారెడ్డి పదవి విరమణ సభలో వారు ముఖ్యఅతిథిలుగా పాల్గొనన్నారు. వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కషి చేస్తోందన్నారు. ఉపాధ్యాయ వత్తి ఎంతో పవిత్రమైనదన్నారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులు సమాజ సేవకు పునరంకితం కావాలన్నారు. ఈ సందర్భంగా వెంకట్‌నర్సింహారెడ్డి లలిత దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లీశ్వరి వెంకన్న, జెడ్పీటీసీ పెండెం ధనలక్ష్మి సదానందం, స్థానిక సర్పంచ్‌ పన్నాల రంగమ్మరాఘవరెడ్డి, కార్యాలయ సూపరిండెంట్‌ వాహబ్, వివిద ఉపాధ్యాయ సంఘాలు, ప్రై వేటు పాఠశాలల వ్యవహర్తలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement