మంటలకు ఆహుతైన కారు | car fire | Sakshi
Sakshi News home page

మంటలకు ఆహుతైన కారు

Published Sun, Jan 8 2017 11:21 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

మంటలకు ఆహుతైన కారు - Sakshi

మంటలకు ఆహుతైన కారు

  • సురక్షితంగా తప్పించుకున్న ప్రయాణికులు
  • తోకాడ (రాజానగరం) :
    రాజానగరం నుంచి అనపర్తికి వెళ్లే ఆర్‌అండ్‌బి రోడ్డుపై తోకాడ శివారులో ఒక కారు మంటలకు ఆహుతైంది. ప్రయాణీకులు మాత్రం సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనపర్తి వైపు వెళ్తున్న ఈ కారు నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో కారును రోడ్డు పక్కకు ఆపి, అందులో ప్రయాణిస్తు్తన్న ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చేయడంతో ప్రాణనష్టం తప్పింది. పొగలు  కాస్త ఉవ్వెత్తున ఎగసి జ్వాలలుగా మారి కారు చూస్తుండగానే  కాలిపోయింది. అయితే ఈ కారు నుంచి బయట పడిన వ్యక్తులు వేరొక వాహనంలో వెళ్లిపోవడంతో వివరాలు తెలియలేదు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగివుండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement