నాటిన మొక్కలను కాపాడాలి | care to plants | Sakshi
Sakshi News home page

నాటిన మొక్కలను కాపాడాలి

Published Thu, Jul 21 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

care to plants

  • ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌
  • పలుచోట్ల ‘హరితహారం’
  • కోహెడ : హరితహారంలో భాగంగా గ్రామాల్లో నాటిన మొక్కలను బాధ్యతతో కాపాడాలని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ అన్నారు. శ్రీరాములపల్లి–నారాయణపూర్‌ రోడ్డుకు ఇరువైపులా గురువారం సుమారు వెయ్యి మొక్కలు నాటారు. కోహెడ హైస్కూల్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వెయ్యి మామిడి, ఉసిరి తదితర మొక్కలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. శనిగరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఎకరం ప్రభుత్వ భూమిలో పలు రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వనాలతోనే వర్షాలు కురుస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉప్పుల స్వామి, జెడ్పీటీసీ సభ్యుడు పొన్నాల లక్ష్మయ్య, కోహెడ పీఎసీఎస్‌ చైర్మన్‌ కర్ర శ్రీహరి, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ తైదల రవి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆవుల మహేందర్, భీంరెడ్డి రాజిరెడ్డి, మండల ప్రత్యేకాధికారి ఇందిర, తహశీల్దార్‌ ఎస్‌కె.ఆరీఫా, ఏవో మాధవి, సర్పంచ్‌లు దొమ్మాట జగన్‌రెడ్డి, గాజె శ్రీధర్, చిట్టెల బాలరాజు, ఎంపీటీసీ సభ్యులు కర్ర రవీందర్, తిప్పారపు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
    హుస్నాబాద్‌ మండలంలో..
    హుస్నాబాద్‌రూరల్‌ : పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని మహ్మదాపూర్, సర్వాయిపేట గ్రామాల్లోని రోడ్ల పక్కన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ ప్రారంభించారు. అలాగే రేగొండ మల్‌చెర్వు తండా, పోతారం(జె) గ్రామాల్లో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో జి.రాంరెడ్డి, తహసీల్దార్‌ టి.వాణి, ఈవోపీఆర్డీ కొత్త అశోక్‌రెడ్డి, పీఆర్‌ డీఈ శ్రీనివాసరావు, ఏఈ టి.మహేశ్, సర్పంచ్‌లు పిట్టల సంపత్, శంకర్‌నాయక్, మల్లయ్య, సిరిసిల్ల బాలరాజు, ఎంపీటీసీ సభ్యుడు కుంట మల్లయ్య, ఉపసర్పంచ్‌లు రాజిరెడ్డి, కరివేద నరేందర్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌ రంగానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
    ఎల్కతుర్తిలో..
    ఎల్కతుర్తి: మండల కేంద్రంలో పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారంలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ పాల్గొని పలు మొక్కలు నాటారు. అంతకు ముందు విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ తంగెడ శాలిణీమహేందర్, సర్పంచ్‌ గోల్లె మాధవీమహేందర్, ఎంపీటీసీ మునిగడుప లావణ్య శేషగిరి, పీఆర్‌ డీఈ శ్రీనివాస్, తహసీల్దార్‌ మల్లేశం, ఎంపీడీవో ఇందుమతి, వీఎస్‌ఎస్‌ చైర్మన్‌ గడ్డం రవి, సర్పంచ్‌లు గుండా ప్రతాప్, చిర్ర కొంరెల్లి, నార్లగిరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
     సైదాపూర్‌లో..
    సైదాపూర్‌: మొక్కలు నాటి.. కరువును తరుమాలని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని ఆకునూర్‌ శివారు వెంకటేశ్వర్లపల్లిలో సైదాపూర్‌ పోలీసుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్‌రెడ్డి, హుజురాబాద్‌ రూరల్‌ సీఐ గౌస్‌బాబా, ఎంపీపీ ముత్యాల శ్రీప్రియారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బిల్లా వెంకటరెడ్డి, సింగిల్‌ విండో ౖచెర్మన్‌ కొత్త తిరుపతిరెడ్డి,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సోమారపు రాజయ్య, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మునిగంటి స్వామి, ఖాదీ బోర్డు డైరెక్టర్‌ పేరాల గోపాల్‌రావు, హుజురాబాద్‌ మార్కెట్‌ డైరెక్టర్‌ పోలు ప్రవీణ్, స్థానిక సర్పంచ్‌ రాయిశెట్టి కోమల, ఎంపీడీవో వినోద, తహసీల్దార్‌ రమాదేవి, ఎంఈవో నర్సింహారెడ్డి, వ్యవసాయాధికారి శ్రీలత,ఎస్సై మాచినేని రవి,హెడ్‌ కానిస్టేబుల్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
    చిగురుమామిడిః మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో గీతకార్మిక సంఘం ఆధ్వర్యంలో  హుస్నాబాద్‌ ఎక్సైజ్‌ సీఐ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కర్జూర మొక్కలు నాటారు. ఎక్సైజ్‌ ఎస్సై శర్వాణి, సర్పంచ్‌ తాడ సుగుణ, ఎంపీటీసీ కత్తుల రమేశ్, ఉపసర్పంచ్‌ వీరన్న, గౌడ సంఘం అధ్యక్షుడు వీరగోని విజ్జగిరి, ఉపాద్యక్షుడు రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. నవాబుపేట్‌లో చిగురుమామిడి పోలీసుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. సర్పంచ్‌ వేణు, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. చిగురుమామిడి తహసీల్దార్‌ కార్యాలయంలో ఎంపీపీ తాడూరి కిష్టయ్య మొక్కలు నాటారు. తహసీల్దార్‌ రాజాగౌడ్, ఎంపీడీవో శ్రీనివాసస్వామి, ఎంఈఓ విజయలక్ష్మి, సర్పంచ్‌ గీకురు రవీందర్, ఎంపీటీసీ ఆకవరం భవాని, ఆర్‌ఐ అక్బర్‌ తదితరులు పాల్గొన్నారు.  
    రంగయపల్లిలో..
    భీమదేవరపల్లి: పంచాయతీరాజ్, ఏఎస్‌డబ్ల్యూవో శాఖల ఆధ్వర్యంలో రంగయపల్లి, భీమదేవరపల్లిలో సుమారు మూడువేల మొక్కలు నాటారు. రంగయపల్లి గ్రామంలో పీఆర్‌ ఏఈ కిషన్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. భీమదేవరపల్లి ఏఎస్‌డబ్ల్యూవో కార్యాలయం, ఎస్సీ వసతి గృహాల్లో వినోద్‌కుమార్‌ మొక్కలు నాటారు. ఎంపీడీవో వంగ నర్సింహారెడ్డి, ఏస్‌డబ్యూవో వినోద్‌కుమార్, సర్పంచ్‌ జిమ్మల భీంరెడ్డి, ఎంపీటీసీ రాజమౌళి, ఏఈలు కిషన్, రాజమల్లారెడ్డి, ఏపీవో కుమారస్వామి, ఈసీ కర్రా శ్రీధర్‌రావు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement