పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటలు | Couples love the police quarters | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటలు

Published Fri, May 1 2015 3:36 AM | Last Updated on Wed, Jul 10 2019 8:02 PM

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటలు - Sakshi

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటలు

నర్సింహులపేట : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట కుటుంబసభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం నర్సింహులపేట పోలీసులను ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నారుు. నల్లగొండ జిల్లా నూతనకల్ మండలంలోని చిన్నంలా గ్రామానికి చెందిన దబ్బెటి వెంకన్న, నర్సింహులపేట మండలంలోని దంతాలపల్లి గ్రామానికి చెందిన అక్కిరెడ్డి స్వాతిలు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అరుుతే వెంకన్న సూర్యాపేటలోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుం డగా, స్వాతి సూర్యాపేటలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. కాగా, వారి ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ మేరకు వెంకన్న, స్వాతిలు ఇటీవల పెళ్లి చేసుకుని కుటుంబసభ్యుల రక్షణ కోరుతూ ఎస్సై వెంకటప్రసాద్‌ను ఆశ్రరుుంచారు. ఇదిలా ఉండగా, ఎస్సై ఇరువురి కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.  

చెన్నారావుపేటలో..

http://img.sakshi.net/images/cms/2015-05/41430431802_Unknown.jpg పోలీసులను ఆశ్రరుుంచింది. ఎస్సై పులి వెంకట్‌గౌడ్ కథనం ప్రకారం.. వుండలంలోని గురిజాల గ్రావూనికి చెందిన గొడిశాల వెంకటేశ్వర్లు-విజయు దంపతుల కువూరుడు వుహేష్.. నర్సంపేట పట్టణానికి చెందిన ప్రశాంతిలు కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అరుుతే ఇరువురి తల్లిదండ్రులు వారి పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో ఇటీవల వారు చిల్పూరు వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కాగా, ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం పోలీసులను ఆశ్రరుుంచారు. ఈ సందర్భంగా ఎస్సై పులి వెంకట్‌గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ ఇరువురి తల్లిండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తావుని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement