Akkireddy
-
పోరస్ ఫ్యాక్టరీ బాధిత కుటుంబాలకు పరిహారం
ముసునూరు: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ ఫ్యాక్టరీ ప్రమాద ఘటనలో మృతి చెందిన, తీవ్రంగా గాయాలపాలైన బాధిత కుటుంబాలకు జిల్లా రెవెన్యూ అధికారి ఏవీ సత్యనారాయణమూర్తి, నూజివీడు ఆర్డీవో కంభంపాటి రాజ్యలక్ష్మి శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిహారం చెక్కులను అందజేశారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ప్రమాదంలో మృతి చెందిన బిహార్‌కు చెందిన మనోజ్ మోచి, అవదేశ్ రవిదాస్, కారు రవిదాస్, సుభాష్ రవిదాస్‌లకు సంబంధించి పరిహారం చెక్కులను వారి భార్యలైన కాజల్ కుమారి, అసర్ఫి దేవి, రుమాదేవి, శాంతిదేవిలకు రూ.50 లక్షల చొప్పున రూ.2 కోట్లను అందజేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రౌషన్ మోచి, వరుణ్ దాస్, సుధీర్ రవిదాస్, సుధీర్ కుమార్ అలియాస్ సుధీర్ రవిదాస్ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులను వారి భార్యలైన రేణుదేవి, కంచన దేవి, రింకు దేవిలకు రూ.15 లక్షలను డీఆర్వో సత్యనారాయణమూర్తి అందజేశారు. కార్యక్రమంలో నూజివీడు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి, ముసునూరు తహశీల్దార్ ఎస్.జోజి, కలెక్టరేట్ సిబ్బంది రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటలు
నర్సింహులపేట : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట కుటుంబసభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం నర్సింహులపేట పోలీసులను ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నారుు. నల్లగొండ జిల్లా నూతనకల్ మండలంలోని చిన్నంలా గ్రామానికి చెందిన దబ్బెటి వెంకన్న, నర్సింహులపేట మండలంలోని దంతాలపల్లి గ్రామానికి చెందిన అక్కిరెడ్డి స్వాతిలు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అరుుతే వెంకన్న సూర్యాపేటలోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుం డగా, స్వాతి సూర్యాపేటలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. కాగా, వారి ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ మేరకు వెంకన్న, స్వాతిలు ఇటీవల పెళ్లి చేసుకుని కుటుంబసభ్యుల రక్షణ కోరుతూ ఎస్సై వెంకటప్రసాద్‌ను ఆశ్రరుుంచారు. ఇదిలా ఉండగా, ఎస్సై ఇరువురి కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. చెన్నారావుపేటలో.. పోలీసులను ఆశ్రరుుంచింది. ఎస్సై పులి వెంకట్‌గౌడ్ కథనం ప్రకారం.. వుండలంలోని గురిజాల గ్రావూనికి చెందిన గొడిశాల వెంకటేశ్వర్లు-విజయు దంపతుల కువూరుడు వుహేష్.. నర్సంపేట పట్టణానికి చెందిన ప్రశాంతిలు కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అరుుతే ఇరువురి తల్లిదండ్రులు వారి పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో ఇటీవల వారు చిల్పూరు వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కాగా, ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం పోలీసులను ఆశ్రరుుంచారు. ఈ సందర్భంగా ఎస్సై పులి వెంకట్‌గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ ఇరువురి తల్లిండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తావుని తెలిపారు.