
దొంతమూరుకి వచ్చిన యువతి
రంగంపేట: ఎక్కడి నుంచి వచ్చిందో ఆ యువతి రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామంలో ప్రత్యక్షమైంది. సుమారు 21 ఏళ్ల వయస్సున్న యువతి గురువారం దొంతమూరు శివారు హైస్కూల్ వద్ద తోటలో ఉండగా కొందరు ఆకతాయిలు వేధిస్తుండడంతో స్థానిక వలంటీర్లు గుర్తించారు. వారి నుంచి రక్షించి ఆ యువతిని వివరాలు అడగగా తన పేరు గీతమ్మ అని, ఊరు బందర్ అని మాత్రమే చెబుతోంది.
చదవండి: ExtraMarital Affair: మామా నీ కూతుర్ని చంపేశా..
ఇంక ఎటువంటి వివరాలు చెప్పలేకపోతోంది. మతిస్థిమితం లేకపోయిన ఆమెను గ్రామ సచివాలయం వద్దకు తీసుకువచ్చారు. మహిళా పోలీస్ పద్మావతి ద్వారా అంగన్‌వాడీ, పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి యువతిని శుభ్రపరచి బట్టలిచ్చి, అన్నం పెట్టారు. అనంతరం ఆ యవతిని రామచంద్రాపురం సంరక్షణ కేంద్రానికి తరలించారు.
చదవండి: నకిలీ ఫేస్‌బుక్ క్రియేట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్.. ఓకే చేయగానే..
Comments
Please login to add a commentAdd a comment