వెంకన్న దయతో కోలుకున్నా.. | recover bjp leader muralidhar rao | Sakshi
Sakshi News home page

వెంకన్న దయతో కోలుకున్నా..

Published Thu, Jan 8 2015 8:39 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

వెంకన్న దయతో కోలుకున్నా.. - Sakshi

వెంకన్న దయతో కోలుకున్నా..

తిరుపతి: గుండెపోటుతో స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధరరావు ఆరోగ్యం పూర్తిగా కోలుకోవడంతో తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. గత ఆదివారం రాత్రి తిరుమలకు నడిచివెళుతుండగా గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు.

 

అనంతరం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.  ఈ సందర్భంగా మురళీధరరావు మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దయ, స్విమ్స్ వైద్యుల కృషితో కోలుకున్నట్టు ఆయన తెలిపారు. తన ఆరోగ్యంపై కంగారుపడి మూడు రోజులపాటు తనతో పాటు ఉన్న బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కారులో బయలు దేరి హైదరాబాద్‌కు పయనమయ్యారు. యూంజియోగ్రామ్ కోసం ఆయన హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement