Muralidharrao
-
గోదావరి జలాలతో సస్యశ్యామలం
సాక్షి ప్రతినిధి, వరంగల్: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూసేకరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై ఆదివారం హన్మకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులతో పాటు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. మంత్రులు మాట్లాడుతూ 5.18 టీఎంసీల సామర్థ్యంతో 1,22,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేయగా.. ఆ మేరకు పూర్తి చేయకుండా నాటి పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దేవాదుల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. జనగామ జిల్లా ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని సూచించారు. ఎత్తైన ప్రదేశంలో ఉన్న వేలేరుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పాలకుర్తి, ఘన్‌పూర్‌లో ఆగిన 6వ ప్యాకేజీ పనులు ప్రారంభించాలని చెప్పారు. మధ్యలోనే వెళ్లిపోయిన ముత్తిరెడ్డి దేవాదులపై సమీక్ష సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చెరువులకు నీటి విడుదల సంబంధిత సమస్యలను స్మితా సబర్వాల్‌కు ముత్తిరెడ్డి వివరిస్తూ అధికారుల తీరుపై విమర్శలు చేశారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి ఆయన్ను వారించారు. ఇందుకు నిరసనగా ఎమ్మెల్యే సమావేశం నుంచి వాకౌట్ చేశారు. -
అధికారంలోకి వచ్చాక ఎస్టీ రిజర్వేషన్లపైనే తొలి సంతకం
కవాడిగూడ: రాష్ట్రంలోబీజేపీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఎస్టీ రిజర్వేషన్ల ఫైల్ మీద ఉంటుందని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి మురళీధర్ రావు చెప్పారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్‌పై కొమురంభీం విగ్రహం వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్టీ రిజర్వేషన్లపై గిరిజనులను సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. దళితబంధు మాదిరిగానే గిరిజనబంధు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్ రెడ్డి చొరవతో మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తింపునిస్తామని చెప్పారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్స వాన్ని అధికారికంగా నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్, గిరిజన ఐక్యవేదిక నేతలు వివేక్ నాయక్, డాక్టర్ హెచ్‌కె నాగు, సిదం అర్జున్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కుతాడి కుమార్, లోనిక రాజు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదు
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అవి టీఆర్ఎస్ ఖాతాలోకి వెళతాయని, టీఆర్ఎస్కు సీట్లు తక్కువ వస్తే కర్ణాటకలో మాదిరి కాంగ్రెస్ మద్దతిచ్చి ఆదుకుంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. టీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కానేకాదని, ఆ పార్టీని రాజకీయంగా ఎదిరించగలిగేది బీజేపీ మాత్రమేనన్నారు. టీఆర్ఎస్తో బీజేపీ కలిసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. బీజేపీకి టీఆర్ఎస్ సహకరిస్తుందని రాహుల్‌గాంధీ, ఇతరపార్టీలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి లాజిక్ లేదన్నారు. శనివారం రాత్రి ఆర్టీసీ కళ్యాణ మండపంలో ‘న్యూ తెలంగాణ ఫర్ న్యూ ఇండియా’విజన్ అండ్ మిషన్–డైలాగ్, హైదరాబాద్ 2018 కార్యక్రమంలో ఆయన వివిధ అంశాలపై సభికులు, ఆన్లైన్లో వీక్షకులు వేసిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఫేస్ బుక్, ట్విట్టర్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. మోదీ పథకాలు అమలుచేయడం లేదు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా, ఆయుష్మాన్ భారత్ తదితర ముఖ్యమైన పథకాలేవి తెలంగాణలో కేసీఆర్ అమలు చేయడం లేదని మురళీధర్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ జాతీయస్థాయిలో ఎలాంటి భవిష్యత్ లేనపుడు, రాష్ట్ర స్థాయిలో మహాకూటమికి ఎలాం టి అడ్రస్ ఉండదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ఇక గతమేనని, గత చరిత్రతోనే బతకాల్సి వస్తుందన్నారు. -
దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేస్తాం
నల్లగొండ టౌన్: రాబోయే ఎన్నికల్లో కర్ణాటకలో అధికారాన్ని దక్కించుకుని దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేస్తామని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. బుధవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర నాయకత్వం పనిచేస్తోందన్నారు. కొన్ని సంవత్సరాలుగా పార్టీ విస్తరణ, రాజకీయ ప్రాబల్యాన్ని పెంచడానికి తీసుకున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చాయన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగువుతోందన్నారు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన నాయకత్వాన్ని అందించలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. -
కేంద్ర కేబినెట్: రేసులోకి తెలుగు వ్యక్తి
న్యూఢిల్లీ: తాజాగా చేపట్టనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరిద్దరికి ప్రాతినిధ్యం లభించే అవకాశం కనిపిస్తోంది. తాజాగా రేసులోకి జలవనరుల నిపుణుడు వెదిరె శ్రీరామ్ రెడ్డి వచ్చినట్టు సమాచారం. భువనగిరికి చెందిన వెదిరె శ్రీరామ్‌రెడ్డి కేంద్ర జలవనరులశాఖ సలహాదారుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. పవిత్ర గంగానది పునరుజ్జీవనం కోసం పనిచేస్తున్నారు. 15 ఏళ్ల పాటు అమెరికాలోని బహుళజాతి కంపెనీ (ఎమ్మెన్సీ)లో పనిచేసిన ఆయన 2014లో బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రిపదవికి దత్తాత్రేయ రాజీనామా చేయడంతో సెంట్రల్ కేబినెట్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేనట్టయింది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత మురళీధర్‌రావు పేరు ప్రముఖంగా వినిపించినా.. తాజాగా రేసులోకి వెదిరె శ్రీరామ్ రెడ్డి కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హరిబాబుకు కేంద్ర కేబినెట్లో చాన్స్ ఇవ్వడంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. -
కేంద్ర కేబినెట్: రేసులోకి తెలుగు వ్యక్తి
-
అమరుల త్యాగం మరువలేనిది
విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే జరుపాలి కాంగ్రెస్, టీఆర్ఎస్కు తేడాలేదు.. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు హుస్నాబాద్ రూరల్ : నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పనకు సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగాలు మరువలేనివని, వారిని స్మరించుకుంటూ విమోచన దినోత్సవాన్ని జరపాల్సిన ప్రభుత్వాలు విస్మరించడం దురదృష్టకరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొలసాని మురళీధర్‌రావు అన్నారు. హుస్నాబాద్‌లో సోమవారం జరిగిన హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నిజాం రజాకార్ల వారసత్వ పార్టీల మద్దతు కోసం రాష్ట్ర ప్రభుత్వం విమోచనదినం జరపడానికి భయపడుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఒక పార్టీ పరిపాలనను ఎప్పుడు కోరుకోరని, తెలంగాణ అస్థిత్వాన్ని తాకట్టుపెట్టి పార్టీలకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాగానే ఉత్సవాలను జరుపుతుందని చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమకారులను గుర్తు చేసుకుంటూ వారి పోరాటాలను స్మరించుకోవాలని బీజేపీ తిరంగయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 17న వరంగల్ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలను బీజేపీ వెలికితీస్తుందని అన్నారు. కాంగ్రెస్ పాలనకు, టీఆర్ఎస్ పరిపాలనకు ఏమి తేడా లేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అమరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చుతామని అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి సుగుణాకర్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు లక్కిరెడ్డి తిరుమల, మండల అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి,భగవాన్‌రెడ్డి, కమ్మం వెంకటేశం, శ్యాంసుందర్‌రెడ్డి, కవ్వ వేణుగోపాల్‌రెడ్డి, రాజిరెడ్డి, సదానందం, విద్యాసాగర్, జనగామ మనోహర్‌రావు, వేణుగోపాల్‌రావు, అనంతస్వామి, అనిల్ పాల్గొన్నారు. -
వెంకన్న దయతో కోలుకున్నా..
తిరుపతి: గుండెపోటుతో స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధరరావు ఆరోగ్యం పూర్తిగా కోలుకోవడంతో తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. గత ఆదివారం రాత్రి తిరుమలకు నడిచివెళుతుండగా గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. అనంతరం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ సందర్భంగా మురళీధరరావు మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దయ, స్విమ్స్ వైద్యుల కృషితో కోలుకున్నట్టు ఆయన తెలిపారు. తన ఆరోగ్యంపై కంగారుపడి మూడు రోజులపాటు తనతో పాటు ఉన్న బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కారులో బయలు దేరి హైదరాబాద్‌కు పయనమయ్యారు. యూంజియోగ్రామ్ కోసం ఆయన హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.