
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అవి టీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళతాయని, టీఆర్‌ఎస్‌కు సీట్లు తక్కువ వస్తే కర్ణాటకలో మాదిరి కాంగ్రెస్ మద్దతిచ్చి ఆదుకుంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కానేకాదని, ఆ పార్టీని రాజకీయంగా ఎదిరించగలిగేది బీజేపీ మాత్రమేనన్నారు. టీఆర్‌ఎస్‌తో బీజేపీ కలిసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. బీజేపీకి టీఆర్‌ఎస్ సహకరిస్తుందని రాహుల్‌గాంధీ, ఇతరపార్టీలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి లాజిక్ లేదన్నారు. శనివారం రాత్రి ఆర్టీసీ కళ్యాణ మండపంలో ‘న్యూ తెలంగాణ ఫర్ న్యూ ఇండియా’విజన్ అండ్ మిషన్–డైలాగ్, హైదరాబాద్ 2018 కార్యక్రమంలో ఆయన వివిధ అంశాలపై సభికులు, ఆన్‌లైన్‌లో వీక్షకులు వేసిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఫేస్ బుక్, ట్విట్టర్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
మోదీ పథకాలు అమలుచేయడం లేదు
మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా, ఆయుష్మాన్ భారత్ తదితర ముఖ్యమైన పథకాలేవి తెలంగాణలో కేసీఆర్ అమలు చేయడం లేదని మురళీధర్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్
జాతీయస్థాయిలో ఎలాంటి భవిష్యత్ లేనపుడు, రాష్ట్ర స్థాయిలో మహాకూటమికి ఎలాం టి అడ్రస్ ఉండదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ఇక గతమేనని, గత చరిత్రతోనే బతకాల్సి వస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment