అమరుల త్యాగం మరువలేనిది
-
విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే జరుపాలి
-
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు తేడాలేదు..
-
బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు
హుస్నాబాద్ రూరల్ : నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పనకు సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగాలు మరువలేనివని, వారిని స్మరించుకుంటూ విమోచన దినోత్సవాన్ని జరపాల్సిన ప్రభుత్వాలు విస్మరించడం దురదృష్టకరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొలసాని మురళీధర్‌రావు అన్నారు. హుస్నాబాద్‌లో సోమవారం జరిగిన హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నిజాం రజాకార్ల వారసత్వ పార్టీల మద్దతు కోసం రాష్ట్ర ప్రభుత్వం విమోచనదినం జరపడానికి భయపడుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఒక పార్టీ పరిపాలనను ఎప్పుడు కోరుకోరని, తెలంగాణ అస్థిత్వాన్ని తాకట్టుపెట్టి పార్టీలకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాగానే ఉత్సవాలను జరుపుతుందని చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమకారులను గుర్తు చేసుకుంటూ వారి పోరాటాలను స్మరించుకోవాలని బీజేపీ తిరంగయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 17న వరంగల్ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలను బీజేపీ వెలికితీస్తుందని అన్నారు. కాంగ్రెస్ పాలనకు, టీఆర్‌ఎస్ పరిపాలనకు ఏమి తేడా లేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అమరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చుతామని అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి సుగుణాకర్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు లక్కిరెడ్డి తిరుమల, మండల అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి,భగవాన్‌రెడ్డి, కమ్మం వెంకటేశం, శ్యాంసుందర్‌రెడ్డి, కవ్వ వేణుగోపాల్‌రెడ్డి, రాజిరెడ్డి, సదానందం, విద్యాసాగర్, జనగామ మనోహర్‌రావు, వేణుగోపాల్‌రావు, అనంతస్వామి, అనిల్ పాల్గొన్నారు.