
నల్లగొండ టౌన్: రాబోయే ఎన్నికల్లో కర్ణాటకలో అధికారాన్ని దక్కించుకుని దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేస్తామని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. బుధవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర నాయకత్వం పనిచేస్తోందన్నారు. కొన్ని సంవత్సరాలుగా పార్టీ విస్తరణ, రాజకీయ ప్రాబల్యాన్ని పెంచడానికి తీసుకున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చాయన్నారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగువుతోందన్నారు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన నాయకత్వాన్ని అందించలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment