సాయం చేయడంలో ఉన్న ఆనందం | Udayan Care: Julio Francis Ribeiro Article on Helping Nature | Sakshi
Sakshi News home page

సాయం చేయడంలో ఉన్న ఆనందం

Published Sat, Mar 20 2021 8:23 PM | Last Updated on Sat, Mar 20 2021 9:10 PM

Udayan Care: Julio Francis Ribeiro Article on Helping Nature - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మా చిన్నమ్మాయి తన వృద్ధ తల్లిదండ్రులను చూడటానికి రోజూ సాయంత్రం వస్తుంటుంది. ఒకరోజు తనతో ఒకమ్మాయిని వెంటబెట్టుకొ చ్చింది. తన ‘మెంటీ’ (మెంటర్‌ పర్యవేక్షించేది మెంటీ) అని పరిచయం చేసింది. ఈ పదం నిఘంటువులో ఉందో లేదో నాకు తెలియదు. నీనా చెప్పేదే మంటే ఆ అమ్మాయికి తానో మార్గదర్శిలా ఉంటున్నా నని. నా పెద్దకూతురు ఆనా కూడా ఇంకో అమ్మాయిని ఇలా చూసుకుంటోంది. ఈ ఇద్దరు ‘మెంటీలు’ తమ హైస్కూలు పూర్తి చేసుకుంటున్నారు. తమ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ను మెరుగు పరుచుకుంటున్నారు.

ఈ అమ్మాయిలను నా కూతుళ్లు కలవడం ఎలా తటస్థించింది? ఢిల్లీ నుంచి ముంబయి వెళ్తున్న విమానంలో ఒక మహిళ నీనాకు తారసపడింది. కలిగిన కుటుంబాల వాళ్లు ఇట్లా ఇళ్లల్లో పనిచేసుకునే కుటుం బాల ఆడపిల్లలను మెరుగుపరిచే ప్రాజెక్టు ఒకటి నడుస్తోందట. అధునాతన మహిళలతో గనక ఆ పేద ఆడ పిల్లల సంపర్కం జరిగితే వాళ్లు కనీసం జీవితంలో ఊహించను కూడా లేని ఉద్యోగాల్లోకి ప్రవేశించగలిగే ఆత్మవిశ్వాసం వారికి కలుగుతుంది. ఇలాంటి ఆడపిల్లల తండ్రులు కార్లు నడుపుతుంటే, తల్లులేమో ఇళ్లల్లో పని చేస్తున్నారు.

ఆనా మార్గదర్శనం చేస్తున్న ముస్లిం అమ్మాయి జూనియర్‌ కాలేజీలో చదువుతోంది. నీనా చూసుకుంటున్న అమ్మాయి ముంబయిలో ఉంటున్న కొంకణ్‌ ప్రాంతీయురాలు. ఈ అమ్మాయిలను ఇట్లా కలిసేలా చేసిన సంస్థ ఢిల్లీలో సుమారు మూడు దశాబ్దాలుగా పనిచేస్తోంది. దాని పేరు ఉదయన్‌ కేర్‌. 2016 నుంచీ దాని కార్యకలాపాలు ముంబయికి విస్తరించాయి. ఆ సంస్థ మార్గదర్శనంలో ఒకమ్మాయి బ్రిటన్‌లో సైన్సులో పీహెచ్‌డీ చేసింది. కిరణ్‌ మోదీ 27 ఏళ్ల కింద ఉదయన్‌ కేర్‌ ప్రారంభించారు. దీనికి దేశవ్యాప్తంగా ఇరవైకి పైగా కేంద్రాలున్నాయి. పదివేలమంది అమ్మాయిల జీవితాల్లో ఉదయన్‌ మార్పు తేగలిగింది.

ఇలాంటి అంకితభావాన్నే నేను శాంతా క్రూజ్‌లో చూశాను. అక్కడ మాజీ ఎంపీ విఠల్‌ బాలకృష్ణ గాంధీ నెలకొల్పిన యూఎస్‌వీ ఫార్మా కంపెనీ ఉంటుంది.  దానికి ఇప్పుడు చైర్‌పర్సన్‌గా ఉన్న ఆయన మనవరాలు లీనా గాంధీ తివారీ వాళ్ల నానమ్మ సుశీలా గాంధీ పేరు మీదుగా ఈ దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కార్పొరోట్‌ సామాజిక బాధ్యత అనే నియ మాలు రాకపూర్వం నుంచే లీనా కంపెనీ చుట్టుపక్కల ఉండే పేదమ్మాయిలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో మునిగివుంది. ఈమెను నేను మా ఐపీఎస్‌ బ్యాచ్‌మేట్‌ సోనమ్‌ వాళ్లింట్లో కలిశాను. ముందు డాన్సు క్లాసులు, తర్వాత డ్రామా క్లాసులు పెట్టగానే ఆ పిల్లలు ఆకర్షితులయ్యారట. నెమ్మదిగా వారికి స్పోకెన్‌ ఇంగ్లిష్, లెక్కలు చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ల భర్త ప్రశాంత్‌ లెక్కలు చెబుతాడు. పాతవాళ్లు, కొత్తవాళ్లు అందరి పేర్లూ లీనాకు తెలుసు.

నాకు తెలిసిన ఇంకో ముస్లిం మహిళ ముంతాజ్‌ బాట్లీవాలా తన సంపాదనలోంచి చాలా పెద్దమొత్తం పేద ముస్లిం ఆడపిల్లల కోసం ఖర్చుచేస్తోంది. ముంతాజ్, ఇంకా వాళ్ల చెల్లె షానీమ్‌ వాళ్ల వారసత్వపు ఇంటిని అనాథాశ్రమంగా మార్చారు. సుమారు యాభై మంది అందులో ఉండి చదువుకుంటున్నారు. ముంతాజ్‌ యోగా గురువు బీకేఎస్‌ అయ్యంగార్‌ శిష్యురాలు. ఆయన ఉన్నరోజుల్లో ప్రతి సంవత్సరం అక్కడికి వచ్చేవారు. ఆశ్రమం సాయంత్రం క్లాసుల్లో యోగా తప్పనిసరి.

చూడాలేగానీ ముంబయిలో ఇతరులను పట్టించుకోవడానికి సిద్ధంగా ఉండే మనుషులను వెతకడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఇట్లా కలిగిన ఇళ్లల్లోని మహిళలు పేద అమ్మాయిలు జీవితంలో పైకిరావ డంలో సాయపడితే, ఇలాంటి ధనికులే తమ ఇళ్లల్లో ఊడ్చుకోవడం, వండుకోవడం, ఉతుక్కోవడం లాంటి పనులు తమకు తామే చేసుకోవాల్సి వస్తుంది. పాశ్చాత్యులు ఇలాంటి పనులు స్వయంగా చేసుకుంటారు. మనం కూడా అమెరికన్లలాగా, యూరోపియన్లలాగా అలాంటి జీవితానికి సర్దుకుపోవడం నేర్చుకుందాం. కోవిడ్‌ లాక్‌డౌన్‌ కాలంలోనే ఈ దిశగా ఒక అడుగైతే పడింది.


- జూలియో రీబేరో 
వ్యాసకర్త మాజీ పోలీసు ఉన్నతాధికారి, దౌత్యవేత్త, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement