
చెన్నై: ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం సుందరం ఫైనాన్స్ తమ కస్టమర్లకు ప్రత్యేకించిన ఆరోగ్య బీమా ప్రొడక్టులను అందించనుంది. ఇందుకు వీలుగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందంపై సంతకాలు చేసింది. కంపెనీకి గల విస్తారమైన నెట్‌వర్క్ ద్వారా కేర్ హెల్త్‌కు సంబంధించిన కొత్త తరహా బీమా సొల్యూషన్లను కస్టమర్లకు ఆఫర్ చేయనుంది.
రిటైల్, గ్రూప్ విభాగాల్లో ఆరోగ్య బీమా ప్రొడక్టులను విక్రయించనుంది. టెక్నాలజీ ఆధారంగా కంపెనీ ఇప్పటికే సమకూరుస్తున్న సేవలకుతోడు కస్టమర్ల ప్రాధాన్యతకు అనుగుణమైన ఆరోగ్య బీమా ప్రొడక్టులను సైతం అందించనున్నట్లు సుందరం ఫైనాన్స్ పేర్కొంది. వెరసి వివిధ బీమా అవసరాలకు తగిన సొల్యూషన్స్‌ను ఒకే చోట సమకూర్చనున్నట్లు తెలియజేసింది.