ఎండలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. చిటపటా చినుకులు పడుతున్నాయి. రుతు సంధి కారణంగా అంటే సీజనల్ మార్పుల వల్ల ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలు రావడం సహజం. ఇటువంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అటువంటి వాటిలో బీట్‌రూట్ ఉత్తమమైనది.
ప్రోటీన్లు విటమిన్లు పుష్కలంగా ఉండే బీట్‌రూట్‌తో తయారు చేసిన ఆహారాలను ప్రతిరోజు తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి లోపం సమస్యలను కూడా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బీట్‌రూట్‌లో ఏయే పోషకాలుంటాయి?
బీట్‌రూట్‌లో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనిని సలాడ్‌లో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది.. ఇది కణాల పెరుగుదలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
- బీట్‌రూట్‌లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు బీట్‌రూట్ జ్యూస్‌ను తాగడం వల్ల రక్తహీనత, రోగ నిరోధక శక్తి సమస్యలనుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
- బీట్‌రూట్‌లో అధిక మోతాదులో లభించే నైట్రేట్ వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడమే కాకుండా రక్తంలో గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా రక్తప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది.
- కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే బీట్‌రూట్ శరీరంలో శక్తి స్థాయులను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తరచు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది.
- బీట్‌రూట్ ఉండే గుణాలు చర్మాన్ని మెరిపించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే ఫోలేట్, ఫైబర్ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. దీని రసాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
- బీట్‌రూట్ రసాన్ని తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు బీట్‌రూట్ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.
(చదవండి: ఇలా చేస్తే ముఖంపై మొటిమలు మాయం! చక్కటి నిగారింపు మీ సొంతం)
Comments
Please login to add a commentAdd a comment