Seasonal
-
వర్షాధార భూముల్లో.. అధిక దిగుబడినిచ్చే.. సరికొత్త బీటీ పత్తి సూటి రకం!
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11న విడుదల చేసిన 61 పంటలకు సంబంధించిన 109 సరికొత్త వంగడాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాధార వ్యవసాయం చేసే రైతులకు ఉపయోగపడే పత్తి సూటి రకం ఒకటి ఉంది. దాని పేరు సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 (ఐసిఎఆర్–సిఐసిఆర్ పికెవి 081 బిటి). నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సిఐసిఆర్) ఈ బీటీ సూటి రకాన్ని రూపొందించింది.ఇప్పటి వరకూ మార్కెట్లో ఉన్న జన్యుమార్పిడి బీటీ పత్తి వంగడాలన్నీ హైబ్రిడ్ రకాలే. ఇది హైబ్రిడ్ కాదు. ఓపెన్ పొల్లినేటెడ్ వంగడం. అంటే.. రైతులు ఈ విత్తనాన్ని ప్రతి సంవత్సరం కొనాల్సిన అవసరం లేదు. దూదిలో నుంచి తీసిన విత్తనాన్ని తిరిగి విత్తుకోవచ్చు. పత్తి సాగులో పెద్ద సమస్యగా మారిన పచ్చదోమ వంటి రసంపీల్చే పురుగులతో ΄ాటు తెగుళ్లను సైతం సమర్థవంతంగా తట్టుకుంటుందని సిఐసిఆర్ డైరెక్టర్ డాక్టర్ వై.జి. ప్రసాద్ ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు.సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 రకాన్ని మూడేళ్లు 15 చోట్ల పండించి చూసిన తర్వాత సివీఐసి దీన్ని దక్షిణాది మెట్ట భూముల్లో సాగుకు ఎంపిక చేసింది. హెక్టారుకు సగటున 17.3 క్వింటాళ్ల పత్తి(సీడ్ కాటన్) దిగుబడి వచ్చింది. ఆదిలాబాద్‌లో 2023–24 సీజన్లో సాధారణ దూరంలో విత్తినప్పుడు అత్యధికంగా హెక్టారుకు 32.05 క్వింటాళ్ల దిగుబడినిచ్చింది. ఇతర రకాలతో ΄ోల్చితే 11–18% అధిక పత్తి దిగుబడినిస్తోంది. దూదిపింజ 26 ఎం.ఎం. పొడవుంటుంది. సగటు దూది పటుత్వం 25.8 జి/టెక్స్. 34–38% గింజల్లేని పత్తి దిగుబడినిస్తుంది. ఈ రకం చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. రసంపీల్చే పురుగులను దీటుగా తట్టుకునే ఈ సరికొత్త బీటీ కాటన్ జినోటైప్ వంగడం దక్షిణాది వర్షాధార తేలిక భూముల్లో అధిక దిగుబడినిస్తుందని సిఐసిఆర్ తెలిపింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనువైనది..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వర్షాధార తేలిక నేలల్లో అధిక సాంద్రతలో విత్తుకోవటానికి సూటిరకమైన సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 (ఐసిఎఆర్–సిఐసిఆర్ పికెవి 081 బిటి) చాలా అనువైనది. చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటూ అధిక దిగుబడినిస్తుంది. సర్టిఫైడ్ సీడ్ వచ్చే ఏడాది ఇవ్వగలం. బ్రీడర్ సీడ్ కొద్ది మొత్తంలో ఉంది. కిలో ధర రూ. 320. వచ్చే ఏడాది విత్తనం కావాలనుకునే వారు ముందుగా బుక్ చేసుకోవచ్చు. నాగపూర్ సిఐసిఆర్లోని విత్తన శాస్త్రవేత్త డా. శాంతిని 98906 84572 నంబరులో సంప్రదించవచ్చు. – డా. వై.జి. ప్రసాద్, డైరెక్టర్, కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ, నాగపూర్, మహారాష్ట్ర -
ఇది పకోడీ కాలం..
ఇది వర్షాకాలం. వాన చినుకులు పడుతుంటే... వేడి వేడి పకోడీలు తింటూ గరం గరం చాయ్ తాగుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఏడాదంతా వర్షాకాలమే ఉంటే బావుణ్ననిపిస్తుంది. ఇది వర్షాకాలం కాదు పకోడీల కాలం అనాలనిపిస్తుంది.పోహా పకోడీ..కావలసినవి:అటుకులు– ఒకటిన్నర కప్పులు;బంగాళాదుంప– అర కప్పు(ఉడికించి చిదిమినది);కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు;పచ్చిమిర్చి తరుగు– టీ స్పూన్;మిరప్పొడి– టీ స్పూన్;చక్కెర – అర టీ స్పూన్;నిమ్మరసం – అర టీ స్పూన్;జీలకర్ర– అర టీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె– వేయించడానికి తగినంత.తయారీ:– అటుకులను ఒక పాత్రలో వేసి (అటుకులు తేలేటట్లు) నిండుగా నీటిని పోసి కడిగి వడపోత గిన్నెలో వేయాలి.– నీరంతా కారిపోయిన తర్వాత తీసి వెడల్పు పాత్రలో వేసుకోవాలి.– అందులో ఉడికించి చిదిమిన బంగాళాదుంప, కొత్తిమీర, పచ్చిమిర్చి, మిరప్పొడి, చక్కెర, జీలకర్ర, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి.– ఈ మిశ్రమం అంతటినీ చిన్న నిమ్మకాయంత గోళీలుగా చేసుకోవాలి.– బాణలిలో నూనె వేడి చేసి, మరుగుతున్న నూనెలోఒక్కో గోళీని మెల్లగా వేయాలి.– మంటను మీడియంలో పెట్టి దోరగా వేగనివ్వాలి.– అన్నివైపులా ఎర్రగా వేగిన తర్వాత చిల్లుల గరిటతో తీసి టిష్యూ పేపర్ మీద వేస్తే పోహా పకోడీ రెడీ. వీటికి పుదీన చట్నీ లేదా టొమాటో కెచప్ మంచి కాంబినేషన్.కార్న్ పకోడీ..కావలసినవి:స్వీట్ కార్న్ గింజలు– 2 కప్పులు;అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు;జీలకర్ర– అర టీ స్పూన్;శనగపిండి– 3 టేబుల్ స్పూన్లు;బియ్యప్పిండి– 3 టేబుల్ స్పూన్లు;గరం మసాలా – అర టీ స్పూన్;ఉల్లిపాయ – ఒకటి (తరగాలి);పచ్చిమిర్చి – 2 (తరగాలి);కరివేపాకు – 2 రెమ్మలు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;పసుపు – పావు టీ స్పూన్;మిరప్పొడి– అర టీ స్పూన్;నూనె – వేయించడానికి తగినంత.తయారీ:– మొక్కజొన్న గింజలను కడిగి చిల్లుల పాత్రలో వేసి నీరు పోయే వరకు ఉంచాలి.– ఈ లోపు ఒక పాత్రలో నూనె మినహా పైన తీసుకున్నవన్నీ వేసి కలపాలి.– మొక్కజొన్న గింజల్లో గుప్పెడు గింజలను తీసి పక్కన పెట్టి మిగిలిన గింజలను మిక్సీలో కచ్చపచ్చాగా గ్రైండ్ చేయాలి.– ఇప్పుడు పక్కన పెట్టిన గింజలను కూడా శనగపిండి మిశ్రమంలో వేసి కలపాలి.– బాణలిలో నూనె మరిగించి పకోడీ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని వేళ్లతో కొద్దికొద్దిగా నూనెలో వేయాలి.– దోరగా వేగిన తర్వాత తీసి టిష్యూ పేపర్ మీద వేస్తే వేడి వేడి కార్న్ పకోడీలు తినడానికి రెడీ. ఇలాగే పిండినంతటినీ చేసుకోవాలి. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాల్సిందే..జాగ్రత్తలే రక్ష!
ఆసిఫాబాద్‌అర్బన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి తుకారాం సూచించారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, సబ్ సెంటర్లలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో ఉన్న సందేహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఇంటర్వూలో వివరించారు. సాక్షి: సీజనల్ వ్యాధులపై ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారు? డీఎంహెచ్‌వో: డిస్ట్రిక్ కోఆర్డినేషన్ కమిటీ (డీసీసీ) ద్వారా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యాధులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ యూనిట్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. 20 మంది మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నాం. ప్రతీ కుటుంబానికి దోమతెరలు అందించాం. ఐటీడీఏ, పంచాయతీరాజ్, ఎంపీడీవోల సహకారంతో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ఐదేళ్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. సాక్షి: వ్యాధుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? డీఎంహెచ్‌వో: ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నీటిని వేడిచేసి చల్లార్చి వడబోసిన తర్వాత మాత్రమే తాగాలి. ఆహారం వేడిగా ఉండగానే భుజించాలి. అన్ని పీహెచ్‌సీల్లో వ్యాధుల నివారణ మందులు అందుబాటులో ఉంచాం. సాక్షి: డెంగీ, టైఫాయిడ్ నిర్ధారణ ఎలా? డీఎంహెచ్‌వో: జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో సీబీపీ (బ్లడ్ పిక్చర్, ప్లేట్లెట్స్, కౌంటింగ్) యంత్రాలు ఉన్నాయి. ప్రజలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు అందుతున్నాయి. జిల్లా కేంద్రంలోని టీహబ్ ద్వారా 53 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది. డెంగీ ఎలిజ టెస్టు ద్వారానే కచ్చితమైన ఫలితం వస్తుంది. సాక్షి: వైద్యశాఖ అందించే చికిత్సలు ఏమిటి? డీఎంహెచ్‌వో: అన్ని పీహెచ్‌సీల్లో యాంటిబయాటిక్స్, క్లోరోక్విన్, ప్రైమ్ ఆక్సిజన్, ఆర్టిపీసీటి, అన్ని రకాల విటమిన్స్, నొప్పులు, సిప్రోప్లోక్సిన్, మెట్రోజిల్, ప్లురోక్సిన్, స్పోర్లాక్, సీసీఎం, డెరిఫిల్లిన్, దగ్గు మందులు, మాత్రలు, ఐవీ ప్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని 20 పీహెచ్‌సీలు, 2 అర్బన్ సెంటర్లు, 118 సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాం. సాక్షి: గ్రామీణులకు అత్యవసర వైద్యం అందేదెలా? డీఎంహెచ్‌వో: రోగిని ఇంటి నుంచి ఆస్పత్రులకు తీసుకువచ్చేందుకు 8 అవ్వాల్, 12 (108) వాహనాలు, 15 (102) వాహనాలు, 1 ఎఫ్హెచ్ఎస్ వాహనం అందుబాటులో ఉంచాం. సాక్షి: సీజనల్ వ్యాధుల వివరాలు తెలపండి? డీఎంహెచ్‌వో: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో డెంగీ–81, మలేరియా–69, టైఫాయిడ్–231 కేసులు నమోదయ్యాయి. (చదవండి: డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?) -
బీట్రూట్ జ్యూస్ తాగే అలవాటుందా? ఇందులోని నైట్రేట్ వల్ల..
ఎండలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. చిటపటా చినుకులు పడుతున్నాయి. రుతు సంధి కారణంగా అంటే సీజనల్ మార్పుల వల్ల ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలు రావడం సహజం. ఇటువంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అటువంటి వాటిలో బీట్రూట్ ఉత్తమమైనది. ప్రోటీన్లు విటమిన్లు పుష్కలంగా ఉండే బీట్రూట్తో తయారు చేసిన ఆహారాలను ప్రతిరోజు తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి లోపం సమస్యలను కూడా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీట్రూట్లో ఏయే పోషకాలుంటాయి? బీట్రూట్లో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనిని సలాడ్‌లో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీట్రూట్లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది.. ఇది కణాల పెరుగుదలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. బీట్రూట్లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్‌ను తాగడం వల్ల రక్తహీనత, రోగ నిరోధక శక్తి సమస్యలనుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. బీట్రూట్లో అధిక మోతాదులో లభించే నైట్రేట్ వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడమే కాకుండా రక్తంలో గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా రక్తప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే బీట్రూట్ శరీరంలో శక్తి స్థాయులను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తరచు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. బీట్రూట్ ఉండే గుణాలు చర్మాన్ని మెరిపించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే ఫోలేట్, ఫైబర్ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. దీని రసాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. బీట్రూట్ రసాన్ని తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు బీట్రూట్ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. (చదవండి: ఇలా చేస్తే ముఖంపై మొటిమలు మాయం! చక్కటి నిగారింపు మీ సొంతం) -
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా గెలిచేది మేమే..
మధ్యప్రదేశ్: రాజ్ గడ్ లో జరిగిన కిసాన్ కళ్యాణ మహాకుంభ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అవసరానికి హిందువుగా అవతారం ఎత్తి ఆమె మధ్యప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికే ప్రియాంక గాంధీ వచ్చారంటూ వ్యాఖ్యానించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. జబల్పూర్లో రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆమె నర్మదా నది వద్ద ప్రార్ధనలు నిర్వహించి ఆ నదిని జీవనదిగానూ, జీవాధారంగానూ వర్ణించడం వెనుక అసలు కారణం వేరే ఉందన్నారు కేంద్ర మంత్రి. ఈ కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ రైతుల సాధికారతతోనే దేశం శక్తివంతంగా తయారవుతుందని అన్నారు. కొందరు రైతుని "అన్నదాత" అంటే మరికొంతమంది వారిని "జీవనదాత" అంటూ ఉంటారు. కానీ నా దృష్టిలో రైతులంటే "భాగ్యవిధాతలు" అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీని విమర్శించాడనికి ఆయన ఇదే సభను వేదికగా చేసుకున్నారు. అవసరాన్ని బట్టి హిందువు అవతారం ఎత్తి ఇక్కడ ప్రజలను మోసం చేయడానికి కొందరు వస్తుంటారు. ఈ మధ్య వారు ఆంజనేయ స్వామి గదను కూడా పట్టుకుని తిరుగుతున్నారు. అలాంటి వారిని నమ్మకండి. నర్మదా నదిని జీవనదిగా ముందు గుర్తించింది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చి ప్రజల్లో మంచి నమ్మకాన్ని సంపాదించుకున్నారు. ఆయన హయాంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ పెరిగింది, అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. ఇక్కడ మహిళలు ఆర్మీలో చేరుతున్నారు, సియాచిన్ నౌకాదళ యుద్ధనౌకల్లో కూడా మహిళలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ బీజీపీ ప్రభుత్వాలు అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నాయని, ఇప్పుడు మీరొచ్చి ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కాంగ్రెస్ పార్టీ నాయకురాలినుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: మతమార్పిడులు చేస్తే జైలుకే.. ఇద్దరు అరెస్టు -
H3N2: సీజనల్ ఇన్‌ఫ్లూయెంజాపై కేంద్రం కీలక ప్రకటన..
న్యూఢిల్లీ: హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా కారణంగా కర్ణాటక, హర్యానాలో ఒక్కొక్కరు మరణించిన తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ఇండిగ్రేటెడ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్(ఐడీఎస్పీ) ద్వారా సీజనల్ ఫ్లూ పరిస్థితిని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపింది. వాస్తవ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఇన్‌ఫ్లూయెంజా కారణంగా ఎంతమంది అనారోగ్యం బారినపడుతున్నారు, ఎంత మంది మరణిస్తున్నారో కూడా ట్రాకింగ్ చేస్తున్నట్లు కేంద్రం చెప్పింది. ఈ ఫ్లూ వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న పిల్లలు, వృద్ధులు ఎక్కువ ప్రభావితం అవుతున్నట్లు తెలిపింది. హెచ్3ఎన్2 కారణంగా కర్ణాటక, హర్యానాలో ఒక్కొక్కరు మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరించింది. అయితే ఈ ఫ్లూ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసా ఇచ్చింది. మార్చి చివరి నాటికి కేసుల్లో తగ్గుదల నమోదవుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 90 హెచ్3ఎన్2 కేసులు వెలుగుచూశాయి. 8 హెచ్1ఎన్1 కేసులు నమోదయ్యాయి. గొత కొద్దినెలలుగా ఈ కేసుల్లో పెరుగుదల కన్పిస్తోంది. 'హాంగ్ కాంగ్ ఫ్లూ'గా పేరున్న ఈ హెచ్3ఎన్2 వైరస్ వల్ల ఇతర ఫ్లూలతో పోల్చితే ఆస్పత్రిలో చేరాల్సిన ముప్పు అధికంగా ఉంటుంది. చదవండి: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? నిజమేనా? ఇదిగో డాక్టర్ల క్లారిటీ..! -
Chinta Chiguru: కిలో రూ.500.. అయినా తగ్గేదేలే!
సాక్షి, అమలాపురం: ‘ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా!.. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా!.. అడ్డ విస్తరిలో ఆరు రుచులు ఉండగా.. బతుకు పండగ చేయరా’ అని ఒక సినిమా పాటలో అన్నట్టు మానవ జీవితంలో ‘రుచి’ని మించిన మాధుర్యం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. అందుకే రుచికి ఇచ్చే ప్రాధాన్యం శుచికి కూడా ఇవ్వరన్నది విదితమే. అందులోనూ ఆతిథ్యానికి పేరొందిన కోనసీమలో రుచికరమైన వంటలకు ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతా కాదు. రకరకాల రుచికరమైన కూరల కోసం ఆస్తులు కూడా అమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదేమో. కోనసీమ వాసులకు పులసకే కాదు.. సాధారణంగా గోదారికి ఎదురీదే పులసలకు ప్రసిద్ధి కోనసీమ. కానీ దానితో పాటు సీజన్ వారీగా దొరికే పలు రకాల ఆహార ఉత్పత్తులపై కోనసీమ వాసులకు ఆసక్తి ఎక్కువే. దాని ఖరీదు ఎంతైనా వెనకాడరు. ఈ సీజన్లో దొరికే ‘చింత చిగురు (వాడుక భాషలో చింతాకు)’ ఒకటి. దీనితో చేసే శాకాహార, మాంసాహార వంటలకు దాసోహం కానివారంటూ ఉండరు. వివిధ రకాల కూరలకు సరిపడినంత కంటే కొంచెం అదనంగా పులపునిచ్చే చింతాకుకు ఫిదా కానివారు ఉండరు. అందుకే గుప్పెడు చింతాకు రూ.25 అన్నా వెనుకాడరు. ప్రస్తుత మార్కెట్లో వంద గ్రాముల చింత చిగురు ధర రూ.50 వరకు ఉంది. అంటే కిలో రూ.500 అన్నమాట. వారపు సంతలు, రోజువారీ సంతలు, ఇళ్లకు వచ్చేవారి వద్ద చింతాకు ఎగబడి కొంటున్నారు. చింత చిగురు పప్పు, చింతాకు కూర (ఉల్లిపాయలు వేసి), చింత చిగురు పనస పిక్కల కూర శాకాహారల జిహ్వ చాపల్యాన్ని తీర్చేవే. మాంసాహార వంటల్లో చింత చిగురు ఇచ్చే రుచి మరింత స్పైసీగా ఉంటుంది. చింత చిగురు పచ్చిరొయ్యలు, ఎండు రొయ్యల రుచి ఆస్వాదించాల్సిందే తప్ప వర్ణించతరం కాదు. కోనసీమ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని బంధు, మిత్రులకు కూరలు తయారు చేసి పంపేవారున్నారిక్కడ. ఇక మేక బోటీని చింతచిగురుతో కలిపి తింటే జీవితాంతం ఆ రుచి మనసుని వదలిపోదంటే నమ్మండి! ముద్ద నోటిలో పెట్టుకుంటే వేడివేడి అన్నంలో వెన్నపూసలా నమలకుండానే కరిగిపోతోందని మాంసప్రియులు లొట్టలు వేస్తూ గొప్పలు చెబుతారు. ఇవే కాకుండా చింతాకు మాంసం, చింత చిగురు మదుళ్లు (చిన్న రకం చేపలు), చింత చిగురు కొతుకు పరిగి (చేప పిల్లలు) కూరలు సైతం పుల్లపుల్లగా లాగించేవారెందరో..! చైత్రమాసం దాటిన వెంటనే చింతచెట్టు చిగురు సేకరించి విక్రయిస్తుంటారు. అయితే ఒకప్పుడు వచ్చినట్టు ఇప్పుడు చింతాకు మార్కెట్‌కు రావడం లేదు. చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో పాటు దీనిని సేకరించడం పెద్ద ప్రయాసగా మారింది. చెట్టు చివరి భాగంలో ఉండే లేత చిగురు చెట్లు ఎక్కి కోసేవారు తగ్గడం వల్ల చింతాకుకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. మేము ఎక్కువ ధర పెట్టి కొంటాం చింతాకు కోసేవారి నుంచి మేము ఎక్కవ ధర పెట్టి కొంటున్నాం. రేటు తక్కువ ఉన్నప్పుడు సంతలకు పట్టుకుని వెళితే రోజుకు రూ.300 మిగిలేది. ఇప్పుడు రేటు పెరిగినా అంతే ఆదాయం వస్తోంది. వచ్చే వారం మాకు చింతాకు కావాలని ముందుగా చెప్పి కొనేవారు ఎక్కువ మంది ఉన్నారు. – అనంతలక్ష్మి, గంగలకుర్రు, అంబాజీపేట మండలం సీజన్లో తినాల్సిందే సీజన్లో చింతాకుతో తయారు చేసే కూరలు ఒకసారైనా తినాల్సిందే. చింతాకుతో చేసిన ఎటువంటి కూరైనా ఇష్టమే. మాకు హైదరాబాద్‌లో విరివిరిగా చింతాకు దొరుకుతోంది. అయితే మా ఇంటి వద్ద నుంచి వండి పంపించిన చింతాకు కూరల రుచేవేరు. – పి.రాజేష్, కఠారులంక, పి.గన్నవరం మండలం -
బిజినెస్ ఢ'మాల్స్'
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ సీజనల్ బిజినెస్‌ను మింగేసింది. వ్యాపారుల అంచనాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. సీజన్ బిజినెస్ మొత్తం ఢమాలైంది. భవిష్యత్‌పై పెట్టుకున్న ఆశలు సైతం ఆవిరైపోయాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీజన్ వ్యాపారం బోల్తా పడింది. రూ.కోట్లాది ఆర్థిక లావాదేవిలన్నీ స్తంభించిపోయాయి. మార్చి, ఏప్రిల్, మే వరకు ఓ వైపు పెళ్లిళ్ల సీజన్, మరోవైపు వేసవి, పండగ సీజన్ వస్తుండటంతో తలరాత మారిపోతుందనుకున్న వ్యాపారులు కరోనా ఎఫెక్ట్‌కు గురయ్యారు. నెల వ్యవధిలోనే వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. కరోనా విస్తరించడం, లాక్డౌన్ విధించడంతో కోలుకోని పరిస్థితికి చేరుకున్నారు. ఓవైపు నిర్వేదం, మరోవైపు కాలజ్ఞనం లాంటి వేదాంతం గురించి మాట్లాడుకుంటూ కాలం గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దెబ్బతిన్న వేసవి సీజన్.. కరోనా లాక్డౌన్ వేసవి సీజన్‌పై పూర్తిస్థాయిలో దెబ్బపడింది. వేసవి కాలాన్ని దష్టిలో ఉంచుకొని ఇక్కడి ఎలక్ట్రానిక్ వ్యాపారులు రూ.కోట్ల విలువైన ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు లాంటివి ఫిబ్రవరిలోనే కొనుగోలు చేసి సీజన్ కోసం గోదాంలలో భద్రపరుస్తారు. వీటన్నింటికీ జూన్ వరకు భారీగా గిరాకీలు ఉంటాయి. ఎలక్ట్రానిక్ పెద్ద వ్యాపార సంస్థలు పెద్దఎత్తున డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఇస్తుంటాయి. మరి కొందరు కేవలం కూలర్ వ్యాపారంపై ఆధారపడి బిజినెస్ కొనసాగిçస్తుంటారు మరి కొందరికి ఉపాధి సైతం కల్పిస్తుంటారు. లాక్‌డౌన్‌తో వేసవి ప్రారంభంలోనే వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి. దీంతో ఆ వస్తు సామగ్రి అంతా గోదాముల్లోనే ఉండిపోయింది. అలాగే షోరూంలు, గోదాంల కిరాయిలతో పాటు అందులో పనిచేసే సిబ్బందికి వేతనాల చెల్లింపు సమస్యగా తయారైంది. హలీమ్ వ్యాపారంపై కూడా.. కరోనా లాక్‌డౌన్‌తో రంజాన్ సీజన్లో హలీమ్ రుచిలేకుండా పోయింది. ఫలితంగా వ్యాపారస్తుల ఆశలు అడియాలయ్యాయి. రంజాన్ నెల వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌లో నోరూరించే హలీమ్‌ను ఆస్వాదించని మాంసాహారులు ఉండరు. హైదరాబాద్ బిర్యానీకి ఎంత పేరుందో.. ఇక్కడి హలీమ్‌కు అదేస్థాయిలో అంతర్జాతీయ గుర్తింపు ఉంది. హైదరాబాద్ మహా నగరం మొత్తం మీద ప్రతి రంజాన్ మాసంలో సుమారు 12 వేలకు పైగా హలీమ్ బట్టిలు వెలుస్తాయి. కేవలం ఈ సీజన్‌పై ఆధారపడి హోటల్ వ్యాపారం సాగించే వాళ్లు సగానికి పైగా ఉంటారు. నగరం నుంచి దేశ, విదేశాలకు సైతం హలీమ్ ఎగుమతి అవుతోంది. మొత్తం మీద హైదరాబాద్‌లో వందకోట్ల వ్యాపారం హలీమ్ ద్వారా జరుగుతుంది. ఈ వ్యాపారంపై సుమారు 50 వేల కుటుంబాలు ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఆధారం ఉపాధి పొందుతుంటారు. ఈ సారి లాక్‌డౌన్‌తో హలీమ్ వంటకాలే లేకుండా పోయాయి. వస్త్ర వ్యాపారంపై.. లాక్‌డౌన్‌తో దుస్తుల వ్యాపారులపై బండ పడినట్లయ్యింది. ఒక వైపు పెళ్లిళ్ల సీజన్, మరోవైపు రంజాన్ పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని తెప్పించిన స్టాక్ గోదాముల్లో ములుగుతోంది. ముఖ్యంగా నగరంలో కేవలం ఈ రెండు సీజన్లలోనే వందల కోట్ల దుస్తుల వ్యాపారం సాగుతుంది. మరోవైపు ఈ దుస్తుల వ్యాపారంపై వేలాది మంది ఆధారపడి ఉపాధి పొందుతుంటారు. ఇప్పటికే పెళ్లిళ్ల మూహుర్తాలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. ఫంక్షన్ హాళ్లు సైతం మూతపడటంతో వీటిపై ఆధారపడ్డ వందల సంఖ్యలో లేబర్లు, పూలవ్యాపారులు, ఎలక్ట్రానిక్ వ్యాపారులు సైతం ఉపాధిని కోల్పోయారు. మరోవైపు రంజాన్ నెల ప్రారంభమైనా.. సీజన్ బిజినెస్‌ను లాక్డౌన్ వెంటాడుతూనే ఉంది. చిన్నా చితకా వ్యాపారానికి సైతం ఆస్కారం లేకుండా పోయింది. ఒక వేళ లాక్డౌన్ సడలించినా.. వైరస్ భయంతో షాపింగ్ చేసే పరిస్థితి కానరావడం లేదు. వ్యాపారం స్తంభించిపోవడంతో యజమానులు తల్లడిల్లిపోతున్నారు. కోలుకోవడం కష్టమే.. కరోనా ప్రభావంతో అన్నిరకాల దుకాణాలు, వ్యాపారాలు మూతపడటంతో వందల కోట్ల లావాదేవీలు పతనమైపోయాయి. దీంతో మహా నగరంలో వ్యాపార, వాణిజ్య రంగాలు మరో ఏడాది వరకు కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. చాలామంది వ్యాపారులు సీజన్ దందా కోసం బ్యాంకుల్లోనూ, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి పెద్దమొత్తంలో అప్పులు తీసుకుంటారు. అయితే ప్రస్తుతం అప్పుల చెల్లింపు, సిబ్బందికి వేతనాల చెల్లింపుతో పాటు షోరూంలు, గోదాంల కిరాయిలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. -
ఆ హామీ ... ఆచరణలో లేదేమీ...?
- ‘తూర్పు’ ఏజెన్సీలో వరుస మరణాలు - ప్రతి ఏడాది పునరావృతమవుతున్నా ప్రభుత్వ చర్యలు శూన్యం - ప్రతిపాదనలు దాటని సీఎం చంద్రబాబు హామీలు - విలీన మండలాల్లో పరిస్థితి మరింత దారుణం - ప్రసవం కోసం తెలంగాణ వెళ్లాల్సిందే సాక్షి, రాజమహేంద్రవరం : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఏటా మలేరియా, టైఫాయిడ్, అంతుచిక్కని వ్యాధులతో గిరిజనులు మరణిస్తున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదు. సకాలంలో వ్యాధిని గుర్తించి, చికిత్స అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బందితోపాటు మౌలిక వసతులు ఇక్కడ కరువయ్యాయి. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడకు వచ్చి ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోవడంలేదు. గత ఏడాది ఏప్రిల్ 13వ తేదీన సీఎం చంద్రబాబు విలీన మండలాల పర్యటనకు వచ్చారు. చింతూరులో నిర్వహించిన బహిరంగ సభలో వరాల జల్లు కురిపించారు. అయితే ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటినా పనులు గడప దాటనివిధంగా ఉన్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన వీఆర్ పురం, ఎటపాక, చింతూరు, కూనవరం మండలాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చింతూరు ప్రాథమిక వైద్యశాలను ఏరియా ఆస్పత్రిగా మారుస్తామని, స్పెషలిస్ట్ వైద్యులను నియమించి పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు అందిస్తామని ప్రజల సాక్షిగా అప్పట్లో సీఎం ప్రకటించారు. ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మూడు నెలల్లో ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, ఆ హామీలేవీ ఇప్పటికీ అమలుకు నోచలేదు. ఏరియా ఆస్పత్రి కోసం ప్రకటించినా, ఆ భవనం ఇంకా పునాదుల దశలోనే ఉంది. ఆపరేషన్ థియేటర్‌ను పక్కనే ఉన్న స్కూలు భవనంలో ఏర్పాటు చేశారు. కానీ అది బోర్డులకే పరిమితమైంది. అక్కడ ఎలాంటి పరికాలు, సౌకర్యాలు లేవు. సీఎం హామీ ఇచ్చి 14 నెలలవుతున్నా భవనం పూర్తి కాలేదు. ఇక వైద్య పోస్టుల భర్తీకి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేయాల్సిన ఉత్తర్వులను ఇప్పటివరకూ విడుదల చేయలేదు. మరణాలకు అడ్డుకట్ట ఎప్పుడు? గత ఏడాది విలీన మండలాల్లో అంతుచిక్కని కాళ్లవాపు వ్యాధితో 16 మంది మరణించారు. మాతాశిశు మరణాలతోపాటు టైఫాయిడ్, మలేరియా, విషజ్వరాలతో తరచూ చనిపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఏటా వర్షాకాలంలో జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రబలుతుంటాయి. గత ఏడాది జరిగిన మరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం మిన్నకుంది. ఫలితంగానే వై.రామవరం మండలం చాపరాయిలో 16 మంది మలేరియాతో మరణించారు. తాజాగా చింతూరులో మడివి దేవుడమ్మ (3) అనే గర్భిణి, వీఆర్ పురం మండలంలో తొమ్మిదేళ్ల చిన్నారి జశ్వంత్ మలేరియాతో సోమవారం మరణించారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో పని చేయడానికి వైద్యులు ఆసక్తి చూపడంలేదంటూ ప్రభుత్వం సాకులు చెపుతోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో రూ.1.30 లక్షలు ఇస్తామన్నా ఎవ్వరూ రావడం లేదని జిల్లా వైద్యాధికారులు అంటున్నారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, ఇతర సిబ్బంది పోస్టులను ప్రభుత్వమే నేరుగా భర్తీ చేస్తే ఎందుకు రారన్న ప్రశ్నకు వారివద్ద సమాధానం లేదు. ముందుగా గుర్తిస్తేనే సమస్యలకు పరిష్కారం... బాహ్య ప్రపంచానికి దూరంగా ఎలాంటి రహదారి సౌకర్యం లేని ఏజెన్సీ గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రబలినప్పుడు వైద్యాధికారులు తక్షణమే గుర్తించి వైద్యసేవలు అందిస్తే ప్రాణాలు దక్కుతాయి. గర్భిణులకు ప్రారంభం నుంచి మంచి పౌష్టికాహారం అందిస్తూ తరచూ వైద్య పరీక్షలు నిర్వహిస్తే మాతాశిశు మరణాలను అరికట్టవచ్చు. కానీ ఇక్కడ ఉన్న వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో అవేమీ జరగడం లేదు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 95 సబ్‌సెంటర్ల పరిధిలో 486 పోస్టులున్నాయి. వీటిలో 139 పోస్టులను భర్తీ చేయలేదు. ఇక విలీన మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చింతూరు పీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా మార్చినా వైద్య పోస్టులను భర్తీ చేయలేదు. ఏరియా ఆస్పత్రిలో నలుగురు సివిల్ సర్జన్లు, డెంటిస్ట్, గైనకాలజిస్ట్, మత్తు వైద్యుడు వంటి స్పెషలిస్టు పోస్టుల భర్తీ చేపట్టలేదు. స్టాఫ్‌నర్సులను నియమించలేదు. వరరామచంద్రపురం మండలం రేఖపల్లి, కూటూరు పీహెచ్‌సీల్లో వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కూనవరం సీహెచ్‌సీలో 25 మంది సిబ్బందికిగాను 15 మంది మాత్రమే ఉన్నారు. ఫలితంగా గిరిజనులకు కనీస వైద్య సేవలు అందడం లేదు. దీంతో రంపచోడవరం పరిసర ప్రాంతాల గిరిజనులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి, విలీన మండలాల గిరిజనులు భద్రాచలం ఆస్పత్రికి వెళుతున్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు చింతూరులో ఏరియా ఆస్పత్రి నిర్మాణం పూర్తయి, వైద్యాధికారులను నియమించి ఉంటే భద్రాచలం ఆస్పత్రిలో నిండు గర్భిణి మడివి దేవుడమ్మ మలేరియా వల్ల సోమవారం మరణించి ఉండేది కాదు. సిజేరియన్ చేయాలని వైద్య పరీక్షలు నిర్వహించగా మలేరియా సోకినట్టు వైద్యులు గుర్తించారు. అదే ప్రారంభంలోనే గుర్తించి ఉంటే వైద్యం అందించి ఉంటే దేవుడమ్మతోపాటు, నెలలు నిండిన గర్భస్థ శిశువు కూడా ప్రాణాలతో ఉండేవారు. సీఎం హామీల మేరకు ప్రతిపాదనలు పంపాం... ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. చింతూరులో రెగ్యులర్ పోస్టు ఒక్కటే ఉంది. ఏరియా ఆస్పత్రికి అవసరమైన వైద్య పోస్టులు, సిబ్బంది, యంత్రాల కోసం ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి జీఓ రావాల్సి ఉంది. - డాక్టర్ టి.రమేష్ కిశోర్, జిల్లా ప్రభుత్వాస్పత్రుల సమన్వయ అధికారి -
సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలి
∙జాయింట్ డైరెక్టర్ సుబ్బలక్ష్మి ఎంజీఎం : సీజనల్ వ్యాధుల నియంత్రణకు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మలేరియా, డెంగ్యూ, మెదడువాపు కేసులు నమోదైన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి కారణాలు విశ్లేషించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జాయింట్ డైరెక్టర్(ఎపాడమిక్స్) జి.సుబ్బలక్ష్మి సూచిం చారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎక్కువగా జ్వరాలు నమోదైన ప్రాంతాల్లో ఇంటింటా స ర్వే నిర్వహించి, వ్యాధుల ప్రబలకుండా అవగాహన కల్పించాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఐసీడీఎస్, ఐకేపీలతో సమన్వపరుచకుంటూ ప్రజలకు అవగాహన కల్పిం చాలన్నారు. సమీకృత వ్యాధి సర్వేలె¯Œ్స ప్రాజె క్టు ఐడీఎస్పీలో భాగంగా పీహెచ్‌సీలు, ఇతర ఆస్పత్రులు ఫారం–పి (పీహెచ్‌సీకి సంబంధించిన ఫారం) ఫారం–ఎస్ (ఉపకేంద్రానికి సంబంధించినది), ఫారం–ఎల్(ల్యాబ్‌కు సంబంధించినది) రిపోర్టులను తప్పనిసరిగా పంపించాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్ఓ శ్రీరాం, మధుసూదన్, డీఐఓ హరీశ్‌రాజు, ఐడీఎస్పీ అధికారి కృష్ణారావు, అశోకా ఆనంద్, వెంకటరమణ, సుధీర్, డెమో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
హుజూర్నగర్ : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరాజు సూచించారు. శుక్రవారం పట్టణంలోని 17వ వార్డులో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల మందును స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమకాటు వల్ల మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. కౌన్సిలర్ తన్నీరు మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ వార్డు పరిస్థితులను ‘సాక్షి’ దినపత్రిక ఇటీవల నిర్వహించిన ఫోన్ ఇన్‌లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి భానుప్రసాద్‌నాయక్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆరోగ్య సిబ్బంది వార్డును సందర్శించి దోమల నివారణకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సీజనల్ వ్యాధుల బారినపడకుండా ప్రజలకు అవగాహన కల్పించేలా చేసిన ‘సాక్షి’ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ జాన్పాషా,హెల్త్ అసిస్టెంట్ రామకృష్ణ, ఆశా కార్యకర్తలు మాధవి, మంగమ్మ, వార్డు ప్రజలు పాల్గొన్నారు. -
పట్టింపేది..!
జిల్లాలో జోరుగా వర్షాలు దడపుట్టిస్తున్న సీజనల్ వ్యాధులు అటకెక్కిన పారిశుధ్యం బల్దియాల్లో పొంచి ఉన్న రోగాల ముప్పు జాడలేని సమన్వయ కమిటీ సమావేశం కానరాని స్పెషల్ డ్రైవ్ 'హరితహారం'లో అధికారులు నిమగ్నం సాక్షి, మంచిర్యాల : వర్షాలతో జిల్లా తడిసి ముద్దవుతోంది. సీజనల్ వ్యాధుల భయంతో పల్లెలు ఉలిక్కిపడుతున్నాయి. ఏ వ్యాధి ఎవరి ప్రాణాలు బలిగొంటుందోననే ఆందోళన ఏజెన్సీ ప్రాంత ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పాఠశాలల్లో లోపించిన పారిశుధ్యంతో ఏ జబ్బు వస్తుందో తెలియడం లేదు. జిల్లాలోని మున్సిపాల్టీలతోపాటు వందలాది గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. పారిశుధ్యంపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం, అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. వర్షాకాలం ఆరంభానికి ముందే సీజనల్ వ్యాధులపై చర్చించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారుల సమన్వయ కమిటీ సమావేశం ఇప్పటికీ నిర్వహించలేదు. ఈ నెల 13 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి జారీ చేసిన సర్క్యులర్ సైతం బుట్టదాఖలైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'హరితహారం'పైనే అధికారులు దృష్టి సారించారు. వచ్చే నెల ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆ పథక పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ విషయమై తూర్పు ప్రాంతానికి చెందిన ఓ పంచాయతీ విస్తరణ అధికారి(ఈవో పీఆర్డీ) స్పందిస్తూ.. వాస్తవానికి ఈ సీజన్లో కేవలం పారిశుధ్యంపైనే దృష్టి పెట్టాలి. కానీ ప్రభుత్వం హరితహారంపైనే దృష్టి పెట్టడంతో మేమంతా మొక్కలు నాటే ప్రదేశాలు.. మొక్కల గుర్తింపు.. రైతుల భాగస్వామ్యంపైనే దృష్టిపెట్టాం. సర్క్యులర్ ప్రకారం జరగాల్సిన పారిశుధ్య కార్యక్రమాలు జరగడం లేదు’ అన్నారు. ఫలితంగా పల్లెల్లో పారిశుధ్య కార్యక్రమాలు అటకెక్కాయి. ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. 610 గ్రామాలతోనే సరి.. క్షేత్రస్థాయిలో మెడికల్ ఆఫీసర్ల నివేదిక ఆధారంగా ఏటా 1200 గ్రామాల్లో ప్రజలు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నట్లు జిల్లా వైద్యాధికారులు గుర్తించారు. వీటిలో మలేరియా వ్యాధిగ్రస్తులే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. కానీ 1200 గ్రామాలకు సరిపడా మలేరియా మందులు ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో వ్యాధి తీవ్రతను బట్టి 610 గ్రామాలకు సరిపడా మందుల కోసం ప్రభుత్వానికి నివేదించారు. పారిశుధ్యం విషయానికొస్తే.. జిల్లావ్యాప్తంగా 866 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో సగానికి పైగా పంచాయతీల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది. మూడు రోజుల కిత్రం కురిసిన వర్షాలకు పలు చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గ్రామాల్లో రోడ్లు గుంతలమయమయ్యాయి. అందులో నీరు చేరి బురదగా మారింది. ఈగలు.. దోమలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. డ్రైనేజీ నీరు రోడ్డుపై వచ్చి చేరుతోంది. పారిశుధ్య పనులు కంటికి కానరావడం లేదు. ఇదే సమస్య పట్టణాల్లోనూ నెలకొంది. జాడలేని నిధులు.. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద విలేజ్ హెల్త్ అండ్ సానిటేషన్ కోసం వర్షాకాలంలో ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10వేల చొప్పున ఏటా రూ.86.60లక్షలు విడుదలవుతాయి. నిధులను ఏఎన్ఎం, గ్రామ కార్యదర్శి ఖాతాలో జమ చేస్తారు. వీటితో వర్షాకాలం రాకముందే.. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలి. రహదారుల వెంట ఉన్న కలుపు(పిచ్చి)మొక్కలు తీయడం, డ్రెయినేజీల్లో పూడికతీత, బావులు, నీళ్ల ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయాలి. గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్, దోమల మందు అందుబాటులో ఉంచాలి. వర్షపు నీరు నిల్వ ఉండకుండా కాలువలు తవ్వాలి. గత రెండేళ్ల నుంచి జిల్లాకు ఈ నిధులు రాలేదు. దీంతో సగానికి పైగా గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులు జరగడం లేదు. కొన్ని గ్రామాల్లో మాత్రమే 13వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్స్ వినియోగిస్తున్నారు. సమన్వయ సమావేశమేదీ..? జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా పంచాయతీ అధికారి, ఆర్డబ్ల్యూఎస్, డీఎంహెచ్‌వో, మత్స్యశాఖ డీడీ, కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీ కమిషనర్లు, ఐసీడీఎస్ పీడీ, ఐకేపీ అధికారులతో సమావేశం నిర్వహించాలి. సమావేశంలో అన్ని శాఖల అధికారులు వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తీసుకున్న చర్యలపై చర్చించాలి. తీసుకున్న నిర్ణయాలు.. బాధ్యతలు నిర్వర్తించే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి. కానీ సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించకపోవడంతో జిల్లాలో పారిశుధ్యం లోపించి.. ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. పల్లెల్లో శానిటేషన్ జరగాలిలా... జిల్లా పంచాయతీ అధికారి.. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై గ్రామ కార్యదర్శులకు స్పెషల్ డ్రైవ్ బాధ్యతను అప్పగించాలి. నీరు నిల్వ ఉన్న చోట దోమలు(లార్వా) వృద్ధి చెందే అవకాశాలు ఉండడంతో గుంతలు పూడ్చాలి. మురుగునీరు నిల్వ ఉండకుండా మోరీ ఏర్పాటు చేయాలి. తాగునీటిని క్లోరినేషన్ చేయాలి. ప్రాజెక్టుల వద్ద బ్లీచింగ్ పౌడర్ వేయాలి. కానీ చాలా పంచాయతీల్లో క్లోరినేషన్ జరగనే లేదు. జిల్లాలో వ్యాధులు ప్రబలిన వెంటనే స్పందించి ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు ర్యాపిడ్ యాక్షన్ టీంల ఏర్పాటు.. సరిపడా మాత్రలు, మందులు అందుబాటులో ఉంచుకోవాల్సిన బాధ్యత వైద్యారోగ్యశాఖది. ప్రస్తుతం ఈ శాఖ స్పందన బాగానే ఉంది. పారిశుధ్యం, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేలా అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘ సభ్యులకు బాధ్యతలు అప్పగించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇరువురి సేవలు అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటు జీవో 90 ప్రకారం ఒక గ్రామంలో.. ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు.. ఒక్కో ఆరోగ్య సిబ్బంది(ఏఎన్ఎం, ఎంపీహెచ్‌డబ్ల్యూ)కి ఒక గ్రామం కేటాయించాలి. ముఖ్యంగా పాఠశాలలు, వసతి గృహాల్లో పర్యటించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై దృష్టి సారించాల్సిన బాధ్యత వైద్యశాఖదే.