ఇది వర్షాకాలం. వాన చినుకులు పడుతుంటే... వేడి వేడి పకోడీలు తింటూ గరం గరం చాయ్ తాగుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఏడాదంతా వర్షాకాలమే ఉంటే బావుణ్ననిపిస్తుంది. ఇది వర్షాకాలం కాదు పకోడీల కాలం అనాలనిపిస్తుంది.
పోహా పకోడీ..
కావలసినవి:
అటుకులు– ఒకటిన్నర కప్పులు;
బంగాళాదుంప– అర కప్పు(ఉడికించి చిదిమినది);
కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్‌లు;
పచ్చిమిర్చి తరుగు– టీ స్పూన్;
మిరప్పొడి– టీ స్పూన్;
చక్కెర – అర టీ స్పూన్;
నిమ్మరసం – అర టీ స్పూన్;
జీలకర్ర– అర టీ స్పూన్;
ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;
నూనె– వేయించడానికి తగినంత.
తయారీ:
– అటుకులను ఒక పాత్రలో వేసి (అటుకులు తేలేటట్లు) నిండుగా నీటిని పోసి కడిగి వడపోత గిన్నెలో వేయాలి.
– నీరంతా కారిపోయిన తర్వాత తీసి వెడల్పు పాత్రలో వేసుకోవాలి.
– అందులో ఉడికించి చిదిమిన బంగాళాదుంప, కొత్తిమీర, పచ్చిమిర్చి, మిరప్పొడి, చక్కెర, జీలకర్ర, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి.
– ఈ మిశ్రమం అంతటినీ చిన్న నిమ్మకాయంత గోళీలుగా చేసుకోవాలి.
– బాణలిలో నూనె వేడి చేసి, మరుగుతున్న నూనెలోఒక్కో గోళీని మెల్లగా వేయాలి.
– మంటను మీడియంలో పెట్టి దోరగా వేగనివ్వాలి.
– అన్నివైపులా ఎర్రగా వేగిన తర్వాత చిల్లుల గరిటతో తీసి టిష్యూ పేపర్ మీద వేస్తే పోహా పకోడీ రెడీ. వీటికి పుదీన చట్నీ లేదా టొమాటో కెచప్ మంచి కాంబినేషన్.
కార్న్ పకోడీ..
కావలసినవి:
స్వీట్ కార్న్ గింజలు– 2 కప్పులు;
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్‌లు;
జీలకర్ర– అర టీ స్పూన్;
శనగపిండి– 3 టేబుల్ స్పూన్‌లు;
బియ్యప్పిండి– 3 టేబుల్ స్పూన్‌లు;
గరం మసాలా – అర టీ స్పూన్;
ఉల్లిపాయ – ఒకటి (తరగాలి);
పచ్చిమిర్చి – 2 (తరగాలి);
కరివేపాకు – 2 రెమ్మలు;
ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;
పసుపు – పావు టీ స్పూన్;
మిరప్పొడి– అర టీ స్పూన్;
నూనె – వేయించడానికి తగినంత.
తయారీ:
– మొక్కజొన్న గింజలను కడిగి చిల్లుల పాత్రలో వేసి నీరు పోయే వరకు ఉంచాలి.
– ఈ లోపు ఒక పాత్రలో నూనె మినహా పైన తీసుకున్నవన్నీ వేసి కలపాలి.
– మొక్కజొన్న గింజల్లో గుప్పెడు గింజలను తీసి పక్కన పెట్టి మిగిలిన గింజలను మిక్సీలో కచ్చపచ్చాగా గ్రైండ్ చేయాలి.
– ఇప్పుడు పక్కన పెట్టిన గింజలను కూడా శనగపిండి మిశ్రమంలో వేసి కలపాలి.
– బాణలిలో నూనె మరిగించి పకోడీ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని వేళ్లతో కొద్దికొద్దిగా నూనెలో వేయాలి.
– దోరగా వేగిన తర్వాత తీసి టిష్యూ పేపర్ మీద వేస్తే వేడి వేడి కార్న్ పకోడీలు తినడానికి రెడీ. ఇలాగే పిండినంతటినీ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment