వంటిల్లు..
క్యా... బే... జీ! పిల్లలు ఈ జోక్‌ని సరదాగా ఎంజాయ్ చేస్తారు. సిబ్లింగ్స్ ఒకరినొకరు తిట్టుకోనట్లు తిట్టుకుంటారు. పొగడక తప్పనట్లు పొగుడుకుంటారు. క్యాబేజీ తినమంటే మాత్రం ముఖం చిట్లిస్తారు. వారానికి ఒకసారి క్యాబేజ్ తినమంటోంది ఆరోగ్యం. క్యాబేజీతో ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుంది?
క్యాబేజ్ కుల్చా..
కావలసినవి..
గోధుమపిండి– పావు కేజీ;
నూనె– 2 టీ స్పూన్‌లు;
నీరు – ము΄్పావు కప్పు;
ఉప్పు – పావు టీ స్పూన్;
స్టఫింగ్ కోసం... క్యాబేజ్ – పావు కేజీ;
నూనె – టేబుల్ స్పూన్;
పచ్చిమిర్చి – 2 (తరగాలి);
వాము – అర టీ స్పూన్;
అల్లం తురుము – టీ స్పూన్;
పసుపు – పావు టీ స్పూన్;
కొత్తిమీర తరుగు – టీ స్పూన్;
జీలకర్ర పొడి– అర టీ స్పూన్;
గరం మసాలా పొడి– అర టీ స్పూన్;
ఆమ్‌చూర్ – అరటీ స్పూన్;
ఉప్పు – అర టీ స్పూన్;
నూనె – టేబుల్ స్పూన్.
తయారీ..
– గోధుమపిండిలో ఉప్పు, నీరు పోసి ముద్దగా కలిపి పైన నూనె వేసి అద్ది పలుచని వస్త్రాన్ని కప్పి పక్కన పెట్టాలి.
– క్యాబేజ్‌ని శుభ్రంగా కడిగి మరుగుతున్న నీటిలో వేసి ఐదు నిమిషాల సేపు ఉంచి తీయాలి. నీరు పోయిన తర్వాత తురమాలి.
– వెడల్పు పెనంలో నూనె వేడి చేసి వాము గింజలు వేయాలి.
– అవి చిటపటలాడిన తర్వాత క్యాబేజ్ తురుము, ఉప్పు వేసి కలిపి మంట తగ్గించి మూతపెట్టాలి.
– ఏడెనిమిది నిమిషాలకు క్యాబేజ్ మగ్గుతుంది. అవసరమైతే కొద్దిగా నీటిని చిలకరించాలి.
– ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, అల్లం, పసుపు, ఆమ్‌చూర్ పౌడర్, గరం మసాలా పొడులు వేసి కలిపి మూత పెట్టాలి.
– రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి దించేయాలి. చల్లారే వరకు పక్కన పెట్టాలి.
– ఈ లోపు గోధుమ పిండితో చపాతీలు చేయాలి. ఒక చపాతీ మీద ఒక గరిటె క్యాబేజ్ స్టఫింగ్ పెట్టి ఆ పైన మరో చపాతీ పెట్టి అంచులను చేత్తో అతికించాలి.
– ఇప్పుడు క్యాబేజ్ సమంగా విస్తరించడానికి అప్పడాల కర్రతో జాగ్రత్తగా రోల్ చేస్తే అదే కుల్చా. ఇలాగే పిండి అంతటినీ చేయాలి.
– ఇప్పుడు చపాతీల పెనం వేడి చేసి ఒక్కో కుల్చాను చపాతీలాగానే నూనె వేస్తూ రెండువైపులా కాలనివ్వాలి.
– స్టఫింగ్ బరువుతో కుల్చా విరిగిపోకుండా జాగ్రత్తగా తిరగేయాలి.
– వేడి కుల్చాలోకి వెన్న, పెరుగు మంచి కాంబినేషన్. కారంగా తినాలంటే నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి బాగుంటుంది.
గమనిక: ఆమ్‌చూర్ పౌడర్ లేకపోతే తాజా మామిడి తురుము టీ స్పూన్ తీసుకోవాలి.
క్యాబేజ్ డ్రై మంచూరియా..
కావలసినవి..
క్యాబేజ్ – 200 గ్రాములు (తరగాలి);
ఉల్లిపాయ – 1 (పెద్దది, తరగాలి);
క్యాప్సికమ్ – 1 (తరగాలి);
క్యారట్ – 1 (తరగాలి);
షెజ్వాన్ సాస్ – అర టేబుల్ స్పూన్;
అల్లం తురుము – టీ స్పూన్;
కశ్మీరీ మిరపొ్పడి– అర టీ స్పూన్;
మిరియాల పొడి– పావు టీ స్పూన్;
ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;
శనగపిండి – 100 గ్రాములు;
మైదా – 50 గ్రాములు;
మొక్కజొన్న పిండి– 50 గ్రాములు;
నూనె – వేయించడానికి తగినంత;
గార్నిష్ చేయడానికి... క్యాబేజ్ తురుము – టేబుల్ స్పూన్;
కొత్తిమీర తరుగు – టీ స్పూన్.
తయారీ..
– వెడల్పు పాత్ర తీసుకుని అందులో నూనె మినహా మిగిలిన దినుసులన్నీ వేసి కలిపి పక్కన పెట్టాలి.
– నీరు అవసరం లేదు, కూరగాయల్లోని నీటితోనే పిండి ముద్దగా అవుతుంది.
– అరగంట తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి.
– బాణలిలో నూనె మరిగించి పై మిశ్రమాన్ని చేతి నిండుగా తీసుకుని వేళ్లతో కొద్ది కొద్దిగా నూనెలో వదలాలి.
– కాలి కొంచెం గట్టి పడిన తర్వాత చిల్లుల గరిటెతో అన్ని వైపులా బాగా కాలే వరకు తిరగేస్తూ కాలనివ్వాలి.
– ఒక ప్లేట్‌లో టిష్యూ పేపర్ పరిచి మంచూరియా దోరగా కాలిన తర్వాత తీసి పేపర్ మీద వేయాలి.
– వేడిగా ఉండగానే క్యాబేజ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
ఇవి చదవండి: ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..!
Comments
Please login to add a commentAdd a comment