మీ పిల్లల్లో ఇమ్యునిటి పెరగాలా.. ఇవి తినిపించండి.. | Natural Foods to Boost your Kids Immunity | Sakshi
Sakshi News home page

మీ పిల్లల్లో ఇమ్యునిటి పెరగాలా.. ఇవి తినిపించండి..

Published Tue, Apr 6 2021 3:33 PM | Last Updated on Tue, Apr 6 2021 3:33 PM

Natural Foods to Boost your Kids Immunity - Sakshi

కరోనాను ఎదిరించాడానికి ప్రతి ఒక్కరికి శక్తి అవసరం. పెద్దలకి అయితే, కాస్తంత ఇమ్యూనిటి పవర్‌ ఎక్కువ. మరి చిన్నారులకు సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే వారికి త్వరగా వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరముల ప్రమాదం ఎక్కువ. అయితే మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను వారికి రోజూ తినిపిస్తే చాలు.. వారి రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చు. మరి ఆ పదార్థాలు ఏమిటో చూద్దాం..!

పెరుగు: నిత్యం పెరుగును కచ్చితంగా తినిపించాలి. దీంతో వారి శరీరంలో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. పెరుగులో ఉండే కాల్షియం పిల్లల ఎముకలను దఢంగా చేస్తుంది.

నిమ్మజాతి పండ్లు: నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి తదితర పండ్లను చిన్నారులకు ఇవ్వడం వల్ల వాటిలో ఉండే విటమిన్‌ సి పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి శ్వాసకోశ వ్యాధులను రాకుండా చూస్తుంది.

నట్స్‌: రోజూ జీడిపప్పు, బాదం, పిస్తాపప్పు తదితర నట్స్‌ను తినిపించడం వల్ల వాటిలో ఉండే పోషకాలు వారిలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పిల్లలు బలంగా తయారవుతారు. వారికి సంపూర్ణ పోషణ లభిస్తుంది. అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. 

క్యారెట్లు: పిల్లలకు విటమిన్‌ ఎ, జింక్‌ సమద్ధిగా లభించాలంటే వారికి నిత్యం క్యారెట్లను తినిపించాలి. వీటితో కంటి చూపు మెరుగు పడుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement