చక్కటి ముఖాకృతితోనే అందం ఇనుమడిస్తుంది. నలుగురిలోనూ ప్రత్యేకంగా నిలుపుతుంది. చిత్రంలోని ఈఎమ్‌ఎస్ మైక్రోకరెంట్ ఫేస్ స్లిమ్మింగ్ స్కిన్‌కేర్ మెషిన్ ముఖకండరాలను బిగుతుగా మార్చి, ముఖాన్ని షేప్‌లోకి మారుస్తుంది. నిజానికి చబ్బీగా, గుండ్రటి ముఖంతో కనిపిస్తే, ఎంత అందంగా ఉన్నా, కండరాలు కాస్త పట్టు సడలగానే వయసు ఎక్కువగా కనిపిస్తారు.
అదే ముఖం షేప్‌లో ఉంటే ఆ అందం మరింతగా ఆకట్టుకుంటుంది. ఈ డివైస్ చూడటానికి హెడ్‌ఫోన్స్ మాదిరిగా ఉంటుంది. దీని హెడ్స్‌ని బుగ్గలకు ఆనించి పెట్టుకుని, బటన్ ఆన్ చేస్తే, వైబ్రేట్ అవుతూ ట్రీట్‌మెంట్ అందిస్తుంది. ముఖంపై పేరుకున్న అదనపు కొవ్వును క్రమంగా కరిగిస్తుంది. చర్మాన్ని బిగుతుగా మార్చి, యవ్వనంతో తొణికిసలాడేలా చేస్తుంది. దవడ ప్రాంతంలో సడలిన కండరాలను, గడ్డం కింద డబుల్ చిన్‌ను తిరిగి యథాస్థితికి తీసుకొస్తుంది.
ఈ పరికరం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ అయాన్‌లు వేగంగా చర్మం లోతుల్లోకి చొచ్చుకునిపోతాయి. దీనివల్ల కొలాజెన్ ఉత్పత్తి పెరిగి, ముడతలు తగ్గుతాయి. చర్మం నిగారింపు పెరుగుతుంది. ఈ పరికరం చాలా మోడల్స్‌లో, చాలా రంగుల్లో లభిస్తోంది. ఫేస్ మాస్క్ వేసుకుని కూడా ఈ పరికరంతో ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. ఈ మైక్రోకరెంట్ రోలింగ్‌ను ఎక్కడికైనా సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు. దీనికి ఎప్పటికప్పుడు చార్జింగ్ పెట్టుకుని వినియోగించుకోవచ్చు. దీని ధర సుమారు 28 డాలర్లు. అంటే 2,374 రూపాయలు.
(చదవండి: న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్‌లో..)
Comments
Please login to add a commentAdd a comment