Beauty Tips In Telugu: Homemade Banana Face Pack For All Skin Types - Sakshi
Sakshi News home page

Banana Face Pack : అరటిపండుతో ఫేస్‌ ప్యాక్‌ వేసుకుంటున్నారా? దానిలోని బి12 చర్మానికి..

Published Sat, Jul 22 2023 12:05 PM | Last Updated on Thu, Jul 27 2023 7:03 PM

Homemade Banana Face Pack For All Skin Types - Sakshi

ఈరోజుల్లో ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడా లేకుండా అందానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లు అంటే ఆడవాళ్ల కోసమే ప్రత్యేకంగా ఉండేవి. కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా మేం ఎందుకు తగ్గాలి అని సెలూన్‌ షాప్‌లకు క్యూ కడుతున్నారు. 

వేలకు వేలు తగలేసి మరీ కాస్ట్‌లీ ప్రోడక్ట్‌లను కొంటున్నారు. అయితే ఖర్చు లేకుండానే మన ఇంట్లో దొరికే వస్తువులతో క్షణాల్లో అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో చూసేద్దాం.

బ్యూటీ టిప్స్‌:
అరటి తొక్కతో సహా పండుని ముక్కలుగా తరిగి పేస్టు చేయాలి. ఈ పేస్టుకు రెండు టీస్పూన్ల పచ్చిపాలు పోసి మరోసారి గ్రైండ్‌ చేసి పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా వేసుకుని, ఇరవై నిమిషాలు ఆరాక కడిగేయాలి.

అరటి పండులో ఉన్న విటమిన్‌ బి 6, బి12, ప్రోటీన్‌, ఫైబర్, మెగ్నీషియం,  పొటాషియం చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల ముఖ చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement