
టీ స్పూన్ శనగపిండిలో చిటికెడు పసుపు, అర టీ స్పూన్ పాలు, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత కడిగేయాలి.కొన్ని చుక్కల నిమ్మరసంలో అదే మోతాదులో పచ్చిపాలు కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరవాత కడిగేయాలి.
సగం క్యారట్, ఒక ముక్క నారింజ, అర టేబుల్ స్పూన్ పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ ప్యాక్ వారంలో ఒకసారి చేయడం వల్ల చర్మకాంతి మెరుగుపడుతుంది.