కోమలమైన చర్మాన్ని పొందేటందుకు, చర్మకాంతిని రెట్టింపు చేసుకునేటందుకు సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలే భేషైనవంటున్నారు నిపుణులు. ఖరీదైన కాస్మొటిక్స్ కంటే ఇంటి పట్టున దొరికే పసుపు, పెరుగు వంటి పదార్థాలతో తయారుచేసుకునే లేపనాలే చర్మానికి అన్నివిధాలుగా మంచివంటున్నారు. ముఖంలో మెరుపు రావాలంటే ఓన్లీ ఫేస్‌ప్యాక్‌లే కాదు స్క్రబ్ చేసుకోవడం, క్లీనప్ చేసుకోవడం వంటివి తప్పనిసరి. ఇక ఆవిరి పట్టించుకోవడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి.
కావల్సినవి : క్లీనప్ : టమాటా జ్యూస్ – 2 టీ స్పూన్స్, క్యారెట్ జ్యూస్ – 2 టీ స్పూన్స్, పాలు – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు
స్క్రబ్ : ఓట్స్ లేదా బియ్యప్పిండి – 1 టేబుల్ స్పూన్, గడ్డ పెరుగు – అర టేబుల్ స్పూన్‌నిమ్మరసం – 1 టీ స్పూన్
మాస్క్ : మొక్కజొన్న పిండి – 3 టీ స్పూన్స్, తులసి ఆకుల గుజ్జు – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్, చిక్కటి పచ్చి పాలు – 3 టీ స్పూన్స్
తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని టమాటా జ్యూస్, క్యారెట్ జ్యూస్, పాలు, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్ లేదా బియ్యప్పిండి ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో గడ్డ పెరుగు, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని ముఖానికి అప్లై చేసుకుని, మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని, ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న పిండి, తులసి ఆకుల గుజ్జు, తేనె, పచ్చిపాలు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని, ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment