అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? వాటికోసం వేలకువేలకు తగలేసి కాస్మొటిక్స్ వస్తువులు కొంటుంటారు. కానీ ఈజీగా ఇంట్లోనే దొరికే అరటిపండుతో నిగనిగలాగే స్కిన్‌టోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అరటిపండు తింటే ఆరోగ్యానికే కాదు, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, ముడతలు లేకుండా చేయడంలో సహాయపడుతుంది. అందమైన చర్మం కోసం అరటింపడుతో ఇలా ప్యాక్ వేసుకోండి..
♦ బాగా పండిన అరటిపండును తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
♦ అరటిపండు గుజ్జులో తేనే, పసుపు కలుపుకొని రాసుకుంటే ఇన్‌స్టంట్ గ్లో వస్తుంది.
♦ అరటిపండును మెత్తగా చేసుకోని దానిలో వేపాకు పౌడర్‌ను కలుపుకొని ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్‌ను తరచుగా వేసుకోవడం వల్ల మొటిమలను నివారిస్తుంది.
♦ మెటిమలు, వాటి తాలూకూ మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే అరటిపండు మీ సమస్యకు చక్కని పరిష్కారం.ఒక అరటిపండును తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పేస్ట్‌లా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ తేనె, నిమ్మరసం, శనగపిండి కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
♦ అరటిపండు గుజ్జులో రెండు రెండు స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 20 నిమిషాలయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మృదువుగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment