బ్యూటీ టిప్స్
ఒక బంగాళదుంపను తీసుకుని తొక్క తీసి,పేస్టులా చేసుకోవాలి. దీన్ని పలుచని వస్త్రంలో వడగట్టి నీటిని తీసేయాలి. ఆ గుజ్జులో 6 టేబుల్ స్పూన్లు పాలు కలపాలి. ఈ మిశ్రమంలో 6 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలిపి, ఐస్‌ట్రేలో వేసి రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి.
ముఖాన్ని శుభ్రంగా కడిగి.. ఫ్రీజ్ అయిన బంగాళదుంపతో ముఖమంతా రుద్దాక, చేతులతో సున్నితంగా మర్దన చేసి, ఆరిన తరువాత కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఇలా చేయడం వల్ల ముఖం మీద పేరుకు పోయిన దుమ్మూధూళి, మొటిమల తాలూకు మచ్చలు పోయి ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment