
రోజురోజుకి పెరుగుతున్న కాలుష్యంతో ముఖం రఫ్‌గా మారిపోతోంది. మొటిమలు, ముడతలతో మృదుత్వాన్ని కోల్పోతోంది. తాత్కాలిక పరిష్కారం కోసం మార్కెట్‌లో దొరికే రకరకాల క్రీమ్స్ ఎన్ని పోటెత్తుతున్నా... శాశ్వత పరిష్కారం కావాలంటే ఇంటిపట్టున దొరికే సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌లని ప్రయత్నించాల్సిందే అంటున్నారు నిపుణులు. నిజానికి సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్‌లతో చర్మం సరికొత్త మెరుపుని సంతరించుకుంటుంది. మృతకణాలను తొలగించుకుని ఆకర్షణీయంగా మారుతుంది. మరింకెందుకు ఆలస్యం..? ఇలా ప్రయత్నించండి!
కావలసినవి: నానబెట్టిన బాదం – 4 , కొబ్బరిపాలు, నిమ్మరసం – 2 టీస్పూన్ల చొప్పున, పాల పొడి – 1 టేబుల్ స్పూన్
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో బాదం పప్పును మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరిపాలు, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత పాలపొడి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లని వాటర్‌తో ముఖం క్లీన్ చేసుకుని.. ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment