అందం చెక్కు చెదరకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే మచ్చలు, మొటిమలు దరిచేరకుండా ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ముఖానికి ఖరీదైన ఫేస్‌క్రీమ్స్ రాసుకునే కంటే సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్స్ పూసుకుంటేనే అన్ని విధాలా మంచిదంటున్నారు నిపుణులు. మరింకెందుకు ఆలస్యం? ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని, ఆవిరి పట్టించుకుని, ఫేస్‌ప్యాక్ వేసుకుని సౌందర్యరాశిలా మెరిసిపోండి.
కావల్సినవి :
క్లీనప్ : టమాటా జ్యూస్ – 2 టీ స్పూన్స్, పాలు – 2 టీ స్పూన్స్, తేనె – అర టీ స్పూన్
స్క్రబ్ : కాఫీ పౌడర్ – 4 టీ స్పూన్స్, పంచదార – 4 టీ స్పూన్స్, కొబ్బరి నూనె – 2 టీ స్పూన్స్, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ – 4 లేదా 5 డ్రాప్స్
మాస్క్ : జీడి పప్పులు – 6 లేదా 8, కిస్మిస్ – 1 టీ స్పూన్, తేనె – పావు టీ స్పూన్, పాలు – 2 టీ స్పూన్స్
తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని టమాటా జ్యూస్, పాలు, తేనె వేసుకుని, బాగా కలిపిన తర్వాత ముఖానికి అప్లై చేసుకోవాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కాఫీ పౌడర్, పంచదార, కొబ్బరినూనె, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకుని, ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత ముఖం చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్‌లను మెత్తగా చేసుకుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో తేనె, పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత, గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మోమంత మెరుపు
Published Sun, Sep 2 2018 12:49 AM | Last Updated on Sun, Sep 2 2018 12:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment