
ఆయా సీజన్‌లలో దొరికే అన్ని రకాల పండ్లు, పూలతో సౌందర్యాన్ని ఇనుమడింప చేసుకోవచ్చు. ఉదాహరణకు పుచ్చకాయ రసం, కమలా పండు రసం, మామిడి పండు, దోసకాయ గుజ్జు... దేనితోనైనా ముఖానికి మసాజ్ చేసుకోవచ్చు. జిడ్డు చర్మానికి పుల్లటి పండ్లు వాడితే మంచిది. సాధారణ చర్మం, పొడి చర్మానికి దోస, అరటి వంటి పండ్లు వాడాలి.
బంతి, చామంతి, గులాబీ వంటి పూల రెక్కలను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి ప్యాక్ వేస్తే చర్మం నునుపుదనం సంతరించుకుంటుంది. గులాబీలు అన్ని వయసుల వారూ వాడవచ్చు. చామంతి పూలను టీనేజ్ దాటిన తర్వాత వాడాలి.
తాజా పూలు అన్ని కాలాల్లో దొరకవు కాబట్టి రెక్కలను ఎండబెట్టి పొడి చేసుకుని నిలవ చేసుకోవచ్చు. పాలు, నీళ్లు, పెరుగులో కలుపుకుని ప్యాక్ వేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment